»   » సెక్సీ లేడీ ఎంగేజ్‌మెంట్ బ్రేకప్, వరుడు బకరా అయిన వైనం?

సెక్సీ లేడీ ఎంగేజ్‌మెంట్ బ్రేకప్, వరుడు బకరా అయిన వైనం?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బెంగుళూరు: కన్నడ సెక్సీ హీరోయిన్ పూజా గాంధీ ఎంగేజ్ మెంట్ నవంబర్ 15న జరిగిన విషయం తెలిసిందే. ఆనంద్ గౌడ అనే వ్యక్తితో పూజా గాంధీ నిశ్చితార్థం జరిగింది. తాజాగా వీరికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. పూజాగాంధీ-ఆనంద్ గౌడ మధ్య విబేధాలు వచ్చాయని, వీరి ఎంగేజ్ మెంట్ బ్రేకప్(రద్దు) కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

  కన్నడ టీవీ ఛానల్స్ లో వస్తున్న వార్తల ప్రకారం..... పూజా గాంధీ మదర్ చేసిన కాంమెట్లను బట్టి ప్రస్తుతం వీరిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. పూజా గాంధీ మదర్ ఆనంద గౌడ అధికబరువుపై కామెంట్స్ చేసిందట. అతన్ని కోకాకోలా బాటిల్ అంటూ కామెంట్ చేసిందట. అంతటితో ఆగకుండా ఆనంద గౌడ ఫ్యామిలీ ముందు కూడా అతన్ని అవమాన పరిచినట్లు తెలుస్తోంది.

  అయితే పూజా గాంధీ ఫాదర్ బెంగుళూరు చేరుకుని వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి, విడిపోకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ అయిన ఆనంద గౌడ తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక పూజాగాంధీతో విడిపోవడానికే సిద్ధమయ్యాడని, మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ బ్రేకప్ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

  ఈ పరిణామాలు చూస్తుంటే... పూజా గాంధీ మరియు ఫ్యామిలీ చేతిలో వరుడు ఆనంద గౌడ బకరా అయ్యాడని కర్నాటకలో చర్చించుకుంటున్నారు. కారణమేంటో తెలియదుకానీ ఆనంద గౌడను వదిలించుకోవడానికే పూజాగాంధీ ఫ్యామిలీ ఇలా ప్రవర్తిస్తుందనే వారు లేక పోలేదు. కన్నడ రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్న పూజా గాంధీకి ఇంకేమైనా పెద్ద ఆఫర్ వచ్చిందో ఏమో..?

  ఇతర వివరాల్లోకి వెళితే...
  పూజా గాంధీ ఇప్పటి వరకు వివిధ భాషల్లో 40 సినిమాల వరకు నటించింది. ఆమె తన నటన బెంగాళీ చిత్రం 'టొమాకె సలాం'తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కన్నడ, తమిళం, మళయాలం భాషల్లో అవకాశాలు దక్కించుకుంది. 'దండు పాల్య' అనే కన్నడ చిత్రానికి గాను పూజా గాంధీ నగ్నంగా నటించడానికి సిద్ధం అయింది. ఈ సినిమాతో ఆమె పేరు పాపులర్ అయింది. అదే విధంగా రాజకీయ తెరంగ్రేటం చేసి మరోసారి చర్చనీయాంశం అయ్యారు. కర్నాటకలో ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న జెడి(ఎస్)లో ఆమె ఈ సంవత్సరం జనవరిలో చేరారు. ఆమె కెరీర్లో తొలి బిగ్గెస్ట్ బ్రేక్ యోగరాజ్ భట్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం 'ముంగారు మాలె' చిత్రంతో లభించింది. ఇదే చిత్రం తెలుగులో వాన పేరుతో రీమేక్ అయింది. ఆర్ చంద్రు దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం 'తాజ్ మహల్', ఉపేంద్ర హీరోగా రూపొందిన 'బుదివంత', 'దండుపాల్య' చిత్రాలు ఆమె కెరీర్లో హిట్ చిత్రాలుగా నిలిచాయి.

  English summary
  In what could be called as a shocking development, Pooja Gandhi has reportedly broken up with her beau Anand Gowda. The couple, who had an engagement last month, has reportedly parted ways over some differences.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more