పూజా హెగ్డే, రకుల్​ ప్రీత్​ సింగ్​తో పాన్​ ఇండియా చిత్రం!.. ఇది వేరే లెవెల్​ ప్లాన్​..

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ గురించి ఇప్పట్లో వినడం లేదు కానీ అప్పట్లో ఆయన చేసిన ప్రతి మూవీ ఒక ప్రయోగం. క్రియేటివిటీకి మారుపేరైన కృష్ణవంశీ ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు. సింధూరం లాంటి పవర్​ఫుల్​ ఎమోషనల్​ సినిమా తెరకెక్కించిన, నిన్నే పెళ్లాడతా అని ఫ్యామిలీ డ్రామా రూపొందించడం ఆయన వల్లే సాధ్యం. సూపర్ స్టార్ మహేశ్​ బాబు కెరీర్​లోనే ఓ మైలు రాయిగా నిలిచిన మురారి చిత్రంతో బ్లాక్ బస్టర్​ హిట్​ కొట్టారు. దేశభక్తి నేపథ్యంతో తీసిన ఖడ్గం మూవీ సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు తర్వాత హీరోయిన్లను అంతా అందంగా చూపించే డైరెక్టర్​ ఎవరు? అంటే అది కృష్ణవంశీనే అని చెబుతారు.

సింధూరం, నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం వంటి సూపర్​ హిట్​లు అందుకున్న డైరెక్టర్​ కృష్ణవంశీ శ్రీ ఆంజనేయం, మొగుడు, నక్షత్రం వంటి చిత్రాలతో ఓటమి చవిచూశారు. ఇలా చాలా కాలంగా వరుస పరాజయాలతో డీలా పడ్డ కృష్ణవంశీ సినిమాలకు గ్యాప్​ తీసుకున్నారు.

 మరాఠీ హిట్ సినిమా..

మరాఠీ హిట్ సినిమా..

ప్రస్తుతం ఎలాగైనా హిట్​ కొట్టాలన్న లక్ష్యంతో రంగమార్తాండ మూవీని తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. మరాఠీలో విడుదలై విజయవంతమైన నట సామ్రాట్​ సినిమాకు ఇది రీమేక్​గా రానుంది. సాధారణంగా కృష్ణవంశీ రీమేక్​లపై అంతగా ఆసక్తి కనబరచరు.

సినిమాకు ఫిదా.. రీమేక్​కు ఫిక్స్​..

సినిమాకు ఫిదా.. రీమేక్​కు ఫిక్స్​..

ఎప్పుడూ ఆయన సొంత కథలను నమ్మే సినిమాలు రూపొందిస్తారు. కానీ నట సామ్రాట్​ చిత్రాన్ని వీక్షించిన ఆయన ఫిదా అయి రీమేక్​ చేయాలని డిసైడ్ అయ్యారని టాక్. నట సామ్రాట్​ చిత్రంలో బాలీవుడ్​ ప్రముఖ నటుడు నానా పటేకర్​ ప్రధాన పాత్ర పోషించగా, తెలుగులో ప్రకాష్​ రాజ్​ చేస్తున్నారు.

కీలక పాత్రలో బ్రహ్మానందం..

కీలక పాత్రలో బ్రహ్మానందం..


అలాగే మరో ముఖ్య పాత్ర అయిన నానా పటేకర్​ పక్కన ఫ్రెండ్​ క్యారెక్టర్​గా మరాఠీలో విక్రమ్​ గోఖలో నటించగా తెలుగులో బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారట. సీరియస్​గా ఎమోషనల్​గా ఈ పాత్ర ఉంటుందట. ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ కార్యక్రమాలు జరుపుకుంటోంది ఈ మూవీ.

ఫుడ్​ మాఫియా నేపథ్యంలో..

ఫుడ్​ మాఫియా నేపథ్యంలో..

త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే దీని తర్వాత మరో సినిమా చేయనున్నారు కృష్ణవంశీ. ఇప్పటికే అన్నం అనే సినిమాను ప్రకటించారు. ఇది ఫుడ్​ మాఫియా కథతో తెరకెక్కనుందట. దీంతో పాటు ఒక ఫీమేల్​ సెంట్రిక్​ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడట కృష్ణవంశీ.

 పాన్​ ఇండియాగా..

పాన్​ ఇండియాగా..

ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నా ఈ ప్రాజెక్ట్​ను స్ట్రీమ్​ లైన్​ చేశారని సమాచారం. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే, ఫిట్​నెస్​ సుందరి రకుల్​ ప్రీత్​ సింగ్​లను హీరోయిన్లుగా తీసుకోనున్నారట. అలాగే ఈ చిత్రాన్ని పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కించాలని కృష్ణవంశీ భావిస్తున్నట్లు సమాచారం.

బాలీవుడ్​లో పాగా..

బాలీవుడ్​లో పాగా..


ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోయిన్లకు మంచి పాపులారిటే ఉంది. రకుల్ ప్రీత్ సింగ్​ టాలీవుడ్​లో అంతగా సినిమాలు తీయకపోయినప్పటికీ, బాలీవుడ్​లో అనేక సినిమాలతో బిజీగా మారింది. ఇక బుట్టబొమ్మకు అల వైకుంఠపురం మూవీతో మంచి పాపులారిటీనే వచ్చింది.

త్వరలో ప్రకటన..

త్వరలో ప్రకటన..


ఇటీవల రాధేశ్యామ్​, బీస్ట్​ మూవీస్​ అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఆమె ఫాలోయింగ్​కు ఏ మాత్రం తగ్గలేదనే చెప్పవచ్చు. పైగా వీరిద్దరూ బాలీవుడ్​లో సినిమాలు చేస్తూ తమ ఉనికిని బాగానే కాపాడుకుంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X