Dating: యంగ్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్.. బుట్టబొమ్మ కొత్త ప్రియుడు ఎవరో తెలుసా?

సినీ తారలు అఫైర్ కొనసాగించడం, యువ హీరోలతో డేటింగ్ చేయడం సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. కానీ ఆయా తారల స్టేటస్‌ను బట్టి వారి ప్రేమ వ్యవహారాలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా ముంబై మీడియాకు హాట్ టాపిక్‌గా మారిన హీరోయిన్ పూజా హెగ్డే. అయితే తాజాగా యువ హిందీ హీరోతో కలిసి సన్నిహితంగా తిరుగుతూ కనిపించడంతో ఆమె డేటింగ్ న్యూస్ బాలీవుడ్ మీడియాలో గుప్పుమన్నది. అయితే యువ హీరోతో కలిసి ఒకే కారులో ప్రయాణించడం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆ రూమర్లకు బలం చేకూరేలా చేస్తున్నది. ఇంతకు బుట్టబొమ్మ డేటింగ్ చేస్తున్న యువ హీరో ఎవరనే వివరాల్లోకి వెళితే..

తెలుగు, తమిళ సినీ రంగాలతోపాటు హిందీలో అగ్ర హీరోల సరసన నటించిన పూజా హెగ్డే ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. అల్లు అర్జున్, రాంచరణ్, ప్రభాస్ నుంచి సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి వారితో ఆమె నటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆమె కెరీర్‌లో చాలా మంది హీరోలతో లింకులు పెడుతూ అఫైర్ వార్తలు మీడియాలో స్వైర విహారం చేశాయి.

Pooja Hegde dating Rohan Mehra

గతంలో హృతిక్ రోషన్‌తో రిలేషన్‌షిప్ వ్యవహారం మీడియాలో హంగామాగా మారింది. ఆ తర్వాత పలువురు హీరోలతో ఆమె చనువుగా ఉండటంతో అలాంటి రూమర్లే వచ్చాయి. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలన్నీ కొద్దికాలం పాటు హల్‌చల్ చేసి చల్లబడ్డాయి.

అయితే చాలా రోజుల తర్వాత మరోసారి డేటింగ్ రూమర్లకు పూజా హెగ్డే కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తాజాగా ముంబైలోని ఓ రెస్టారెంట్‌ నుంచి బయటకు వస్తూ ఆమె హిందీ నటుడు రోహన్ మెహ్రాతో సన్నిహితంగా కనిపించారు. దాంతో వారిద్దరూ డేటింగ్ చేస్తూ అఫైర్‌లో ఉన్నారనే వార్తకు ప్రధాన్యం పెరిగింది. అయితే ఇలాంటి వార్తలు మీడియాలో వైరల్ అవుతున్న నమయంలో వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంకా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బాలీవుడ్‌లో రోహన్ మెహ్రీ ఎవరనే వివరాల్లోకి వెళితే.. హిందీ సినీ పరిశ్రమలో పాపులర్ యాక్టర్, స్వర్గీయ వినోద్ మెహ్రీ కుమారుడే రోహన్. యూకేలో విద్యాభ్యాసం చేశాడు. ఆ తర్వాత బాజీరావు మస్తానీ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2018 సంవత్సరంలో రాధిక ఆప్టేతో కలిసి బాజార్ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఐపీసీ 420, కాలా, అద్బుత్ లాంటి సినిమాల్లో నటించారు.

ఇక పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. గత నాలుగేళ్లుగా ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టాయి. దాంతో గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్ నుంచి ఐరెన్ లెగ్ అనే స్థాయికి ఆమె ఇమేజ్ పడిపోయింది. తెలుగులో ఆచార్య, రాధే శ్యామ్ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. తమిళంలో రెట్రో సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. అలా ఇటీవల కాలంలో డజనుకుపైగా సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. ప్రస్తుతం దళపతి విజయ్‌తో కలిసి నటించిన జన నాయగన్, వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హైల సినిమాలపై భారీగా ఆశలు పెట్టుకొన్నారు.

Read more about: pooja hegde prabhas salman khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X