సూపర్‌స్టార్ కొడుకుతో పూజా హెగ్డే డేటింగ్? రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన జంట

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఒకరు. 35 ఏళ్లు నిండినా ఇంకా పెళ్లిపీటలెక్కకుండా సినిమాలతోనే కాలక్షేపం చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. పలువురు హీరోలతో ఆమె ప్రేమలో పడినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ గాలివార్తలుగానే మిగిలిపోయాయి. తాజాగా బుట్టబొమ్మ ఓ హీరోతో డేటింగ్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
డూప్ లేనిదే ఫైట్‌కి రారు.... తెలుగు హీరోలపై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
డూప్ లేనిదే ఫైట్‌కి రారు.... తెలుగు హీరోలపై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

మోడలింగ్ నుంచి సినీరంగం వైపు అడుగులు వేశారు పూజా హెగ్డే. 2012లో తమిళ మూవీ మూగమూడితో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014లో ఒక లైలా కోసం సినిమాతో తెలుగువారిని పలకరించారు. అయితే ముకుంద సినిమాలో తన క్యూట్ లుక్స్‌తో దర్శక నిర్మాతల కళ్లలో పడ్డారు. ఆ తర్వాత డీజే, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్ధల కొండ గణేష్, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలతో టాప్ హీరోయిన్‌గా నిలిచారు.

Pooja Hegde Dating Rumors Is She in a Relationship with Rohan Mehra

తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేశారు. రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు డిజాస్టర్ కావడంతో పూజాహెగ్డే కెరీర్‌లో డౌన్‌ఫాల్ స్టార్ట్ అయ్యింది. హిందీ, తమిళంలోనూ పూజా హెగ్డే సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు ఆమె ఆశలన్నీ జన నాయగన్, హిందీ మూవీ హాయ్ జవానీతో ఇష్క్ హోనా హైపైనే ఉన్నాయి. ఇవి కాకుండా ప్రస్తుతం కాంచన 4, దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న డీక్యూ 41 సినిమాలలో పూజా హెగ్డే నటిస్తున్నారు. పాన్ ఇండియా హీరోయిన్‌గా క్రేజ్ ఉన్నప్పటికీ.. ఆమె సినిమాలు డిజాస్టర్లుగా ఉండటంతో బుట్టబొమ్మ కెరీర్ మసకబారుతోంది.

Recommended For You
హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా? దిమ్మతిరిగేలా స్టార్ యాంకర్ కౌంటర్
హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా? దిమ్మతిరిగేలా స్టార్ యాంకర్ కౌంటర్

2022లో ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ మొదలుకుని ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, దేవా, రెట్రో చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో ఓ సాలీడ్ హిట్ కోసం పూజా హెగ్డే ఎదురుచూస్తున్నారు. జన నాయగన్ సినిమా వివాదాల్లో చిక్కుకోగా.. ఈ సినిమా ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. ఇప్పటికే సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో రిజల్ట్ ఎలా ఉంటుందోనని ఆందోళన నెలకొంది. ఇక హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై‌ మూవీలో ఏఐ వాడకం, పూజా లుక్స్‌పై ట్రోలింగ్ జరగ్గా దానికి మేకర్స్ గట్టిగా బదులిచ్చారు.

You May Also Like
20 Years Of Pokiri: పోకిరి ప్రభంజనానికి 20 ఏళ్లు... రికార్డ్ కలెక్షన్స్‌తో మహేశ్‌బాబు సరికొత్త చరిత్ర!
20 Years Of Pokiri: పోకిరి ప్రభంజనానికి 20 ఏళ్లు... రికార్డ్ కలెక్షన్స్‌తో మహేశ్‌బాబు సరికొత్త చరిత్ర!

పూజా హెగ్డే గతంలో పలువురు హీరోలతో డేటింగ్ చేసినట్లుగా రూమర్స్ వచ్చాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇక లేటేస్ట్‌గా స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో డేటింగ్ చేస్తోందని బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరూ క్లోజ్‌గా ఉండటంతో పాటు హై జవానీ తో ఇష్క్ హోనా హై‌ మూవీలో వరుణ్ ధావన్‌తో రొమాన్స్‌లో హద్దులు దాటేసిందని ఇప్పటికే విడుదలైన ఫోటోలు చెబుతున్నాయి. వరుణ్ ధావన్‌కు ఇప్పటికే పెళ్లికాగా.. త్వరలోనే పూజను పెళ్లాడబోతున్నట్లుగా రూమర్స్ వచ్చాయి.

Peddi: పెద్ది ఐటెం సాంగ్ లీక్.. రిలీజ్‌‌కి ముందే రామ్ చరణ్ మూవీకి బిగ్‌షాక్
Peddi: పెద్ది ఐటెం సాంగ్ లీక్.. రిలీజ్‌‌కి ముందే రామ్ చరణ్ మూవీకి బిగ్‌షాక్

ఇప్పుడు తాజాగా పూజా హెగ్డే గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో రోహన్ మెహ్రాతో పూజ డేటింగ్‌లో ఉందని సినీ సర్కిల్స్‌లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. పూజా- రోహన్‌లు గత కొద్దికాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ రెస్టారెంట్స్, హోటల్స్‌, ఇతర సినీ కార్యక్రమాల్లో జంటగా కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇదే సమయంలో పూజతో ఒకే కారులో కనిపించడం, ఆమె తల్లిదండ్రులతో రోహన్ డిన్నర్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

Rashmika Mandanna: మైసా కోసం రష్మిక మందన్న సాహసం.. ఆ కొడవ బ్లడ్ అలాంటిది మరి!
Rashmika Mandanna: మైసా కోసం రష్మిక మందన్న సాహసం.. ఆ కొడవ బ్లడ్ అలాంటిది మరి!

రోహన్ మెహ్రా.. దివంగత బాలీవుడ్ సూపర్‌స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు. 70, 80 దశకాలలో ఆయన హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందాడు. లవర్ బాయ్‌గా, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న వినోద్ దాదాపు 100కు పైగా సినిమాలలో నటించారు. అయితే చిన్న వయసులోనే వినోద్ మరణించడంతో రోహన్ తన తల్లితో కెన్యాలో పెరిగాడు. 2018లో వచ్చిన బజార్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశాడు. మరి పూజా హెగ్డేతో రోహన్ మెహ్రా రిలేషన్‌లో ఉన్నారా? లేక ఇది రూమర్ మాత్రమేనా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X