స్టార్ హీరో కుమారుడితో పూజా హెగ్డే ప్రేమాయణం.. వైరల్ అవుతున్న డేటింగ్ వ్యవహారం
వరుస అవకాశాలతో మంచి జోష్‌లో ఉంది యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే. టాలీవుడ్ స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రేమలో ఉందని తెలుస్తోంది. సీనియర్ స్టార్ హీరో కుమారుడితో ఆమె డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ పూజా లవ్ చేస్తున్న పర్సన్ ఎవరు? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

బాగా అట్రాక్ట్ చేసిన పూజా హెగ్డే.. అందుకే
'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే.. తెలుగు దర్శకనిర్మాతలను బాగా అట్రాక్ట్ చేసింది. లేటెస్ట్ జనరేషన్‌కి కావాల్సిన అందంతో పాటు ఫిలిం మేకర్స్ కోరుకునే విధంగా అభిమయం ఆమె సొంతం. అందుకే ఈ బ్యూటీకి తెలుగు చిత్రసీమలో వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి.

ఆడిపాడి అలరించిన ముద్దుగుమ్మ.. అలా బ్రేక్ రావడంతో
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ పట్టేసిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో చాలా బిజీగా ఉన్న హీరోయిన్. హరీష్ శంకర్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన డీజే సినిమాతో వచ్చిన బ్రేక్ ఆమెను అమాంతం పైకి లేపింది. ఆ సినిమాలో పూజా అందాలు చూసి.. వరుస ఆఫర్స్ ఇచ్చేశారు మేకర్స్. ఈ మేరకు ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో, మహేష్ బాబుతో ‘మహర్షి'లో ఆడిపాడి అలరించింది పూజా.

అల్లు అర్జున్‌తో అయింది.. ఇక ప్రభాస్ వెంట పడింది
ఇకపోతే ఇటీవలే అల్లు అర్జున్‌తో కలిసి 'అల.. వైకుంఠపురములో' నటించిన ఈ బుట్టబొమ్మ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సంపాదించింది. ఈ సినిమాతో 2020కి కిక్ స్టార్ట్ ఇచ్చి భేష్ అనిపించుకుంది. ప్రస్తుతం తన తదుపరి సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేస్తోంది పూజా. అలాగే అఖిల్‌తో కూడా ఓ సినిమా సెట్స్‌పై రొమాన్స్ చేస్తోంది.

స్టార్ హీరో కుమారుడితో ప్రేమాయణం
ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఓ స్టార్ హీరో ప్రేమలో పడిందని ఓ సమాచారం వైరల్ అవుతోంది. గత సంవత్సరం వచ్చిన బాలీవుడ్ మూవీ 'బజార్' చిత్రంతో పాపులరైన సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ వినోద్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో పడిందని అంటున్నాయి సినీ వర్గాలు.
Recommended Video

వైరల్ అవుతున్న డేటింగ్ వ్యవహారం
అంతేకాదు పూజా హెగ్డే- రోహన్ మెహ్రాతో డేటింగ్ చేస్తున్నారని, పలు ఈవెంట్స్‌లో ఈ జంట హంగామా చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీంతో ఈ ఇష్యూ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా నారింది. మరి ఈ ఇష్యూపై పూజా ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











