రష్మిక మందన్న ముఖం చాటేసింది.. ఆ హీరోను పూజా హెగ్డే పట్టేసింది!

టాలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు అక్కినేని వారసుడు అఖిల్ సిద్ధమవుతున్నాడు. బొమ్మరిల్లు చిత్రంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకొన్న భాస్కర్ కూడా తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్ట్ తెర మీదకు వచ్చినప్పటి నుంచి హీరోయిన్ ఎవరనే ప్రశ్న మీడియాను వెంటాడింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించిన ఓ వార్త మీడియాలో విస్త‌ృతంగా ప్రచారం అవుతున్నది. ఇంతకు ఆ వార్త ఏమిటంటే..

అఖిల్ కోసం హీరోయిన్ వేట

అఖిల్ కోసం హీరోయిన్ వేట

అక్కినేని అఖిల్ పక్కన హీరోయిన్ ఎంపిక చేసేందుకు గీతా ఆర్ట్స్, బొమ్మరిల్లు భాస్కర్ రంగంలో దిగారు. తొలుత అనుపమ పరమేశ్వరన్‌ను అనుకొన్నారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో ఆమె అఖిల్ సరసన నటించలేకపోయారు. ఆ తర్వాత మంచి ఊపు మీద ఉన్న రష్మిక మందన్న ట్రై చేశారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు ఆమె ఓకే చెప్పలేకపోయినట్టు తెలిసింది.

కనికరించిన పూజా హెగ్డే

కనికరించిన పూజా హెగ్డే

ఇదే క్రమంలో అఖిల్ సరసన ఏ హీరోయిన్ అయితే బాగుంటుందని లెక్కలేసుకొన్న యూనిట్ చివరకు హాట్ అండ్ గ్లామర్ గర్ల్ పూజా హెగ్గేను ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో అల్లు అర్జున్‌తో డీజేలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో మెగా హీరో వరుణ్ తేజ్‌తో వాల్మీకి చిత్రంలో నటిస్తున్నది. రొటిన్‌కు భిన్నంగా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించడం విశేషం.

అఖిల్ పక్కన ముదురు హీరోయినా?

అఖిల్ పక్కన ముదురు హీరోయినా?

అయితే అఖిల్ సరసన పూజా హెగ్డే ఏమిటనే అనుమానాలు తొలుత మీడియాలో వ్యక్తమయ్యాయి. అఖిల్ కంటే పూజా వయసు ఎక్కువగా కనిపిస్తుంది? ఎలా సూట్ అవుతుంది అని గుసగుసలు వినిపించాయి. అయితే కథలో ఉండే ఇంటెన్సిటీ, పాత్ర తీరు తెన్నులు అలాంటి ఫీలింగ్‌ను కలిగించవు అనే యూనిట్ పేర్కొంటున్నది.

హిట్టు కోసం బొమ్మరిల్లు భాస్కర్ తహతహ

హిట్టు కోసం బొమ్మరిల్లు భాస్కర్ తహతహ

2013లో ఒంగోలు గిత్త సినిమా తర్వాత కనిపించకుండా పోయిన బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా అఖిల్‌ను మెప్పించడమే కాదు.. గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్‌లో సినిమాను ఒకే చేయించుకొన్నాడు. ఈ సారి ఎలాగైనా కుంభస్థలం కొట్టేంతగా స్క్రిప్టును రెడీ చేసుకొన్నారనే మాట వినిపిస్తున్నది. ఒకవేళ అదే జరిగితే.. అటు భాస్కర్‌కే కాదు.. అఖిల్‌ ఖాతాలో సంపూర్ణంగా సక్సెస్ చేరినట్టే అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X