మరోసారి మహేష్‌తో రొమాన్స్.. రెడీ అవుతున్న పూజా హెగ్డే.. ఏకంగా ముగ్గురు!

హీరోయిన్ పూజాహెగ్డే.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. వరుసపెట్టి స్టార్ హీరోల సరసన నటిస్తూ ఒక్కసారిగా స్టార్ స్టేటస్ పట్టేసింది. ఇటీవలే వరుణ్ తేజ్ సరసన గద్దలకొండ గణేష్ సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈమె.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ఓ సినిమాలో, అలాగే ప్రభాస్ సరసన మరో సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు మహేష్ బాబు కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు'లో కూడా పూజా కనిపించనుందని తెలుస్తోంది.

గతంలో మహేష్ 25వ సినిమా మహర్షిలో మహేష్ బాబుతో జోడీ కట్టి బాగా ఆకట్టుకుంది పూజా. ఈ జోడీ సిల్వర్ స్క్రీన్ రొమాన్స్ చూసి మహేష్ అభిమానులు మురిసిపోయారు. దీంతో ఇది గమనించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. పూజా హెగ్డేతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఓ పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Pooja Hegde in Mahesh Babus SariLeru Neekevvaru..?

ఇప్పటికే ఈ సినిమాలో ప్రత్యేక గీతం కోసం తమన్నాను తీసుకున్నారు. మరో పాట కోసం పూజాను తీసుకోబోతున్నారట. అంటే తమన్నా, పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇలా ముగ్గురు భామలతో 'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ రొమాన్స్ చూడబోతున్నామని స్పష్టమవుతోంది.

మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' సినిమా. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తోంది. కలర్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X