ఎనిమిదేళ్ల విరామం.. మళ్ళీ ఇప్పుడు యంగ్ హీరోయిన్.. ఆ హీరోతో కమిట్!
దాదాపు ఎనిమిదేళ్ల విరామం అనంతరం మళ్ళీ ఇప్పుడు కోలీవుడ్ తెరపై నటించబోతోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. 2012లో తమిళ సినిమా 'ముగమూడి'తో కథానాయికగా అరంగేట్రం చేసిన ఆమె.. తిరిగి ఇప్పుడు మరో తమిళ సినిమా కోసం సిద్దమవుతున్నట్లు టాక్.
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రయోగాత్మక కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో విజయ్‍కి జోడీగా పూజాహేగ్డేను హీరోయిన్‌గా తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.

ఈ మేరకు ఇటీవలే పూజాహెగ్డేతో సంప్రదించినట్లు కూడా జరిగాయని సమాచారం. దర్శకులు చెప్పిన స్టోరీ నచ్చి పూజా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇక కోలీవుడ్ తెరపై కూడా పూజా హంగామా షురూ అయినట్లే.
ఇకపోతే తెలుగులో ప్రస్తుతం పూజా టైమ్ నడుస్తోంది. వరుస సినిమా అవకాశాలు పెట్టేస్తూ జోష్ కొనసాగిస్తోంది. ఈ భామను తమ సినిమాల్లో తీసుకునేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమాలో, అక్కినేని అఖిల్ సరసన మరో సినిమాలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











