క్వారంటైన్‌లో ప్రభాస్.. పూజా హెగ్డేపై రూమర్లు.. రాధేశ్యామ్ షూటింగ్ రద్దు వెనుక అసలు విషయం..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ షూటింగు పలుమార్లు అవాంతరాలను ఎదుర్కొంటున్నది. గత ఏడాది ఎప్పడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికి షూటింగు పూర్తి చేసుకోలేకపోతున్నది. కరోనా లాక్‌డౌన్ కారణంగా గతేడాది షూటింగు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ సినిమా షూటింగును వాయిదా వేశారు. అయితే ఈ వాయిదాకు పూజా హెగ్డే కారణమనే విషయం మీడియాలో వైరల్ అయింది. అయితే అసలు విషయం ఏమిటంటే..

దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్
దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్నది. ఈ పరిస్థితులు టాలీవుడ్‌ను అతలాకుతలం చేస్తున్నది. ఆచార్య, పుష్ప, RRRతోపాటు పలు షూటింగులు వాయిదా పడ్డాయి. తాజాగా ఆ జాబితాలో రాధేశ్యామ్ కూడా చేరింది. అయితే రాధేశ్యామ్ షూటింగు వాయిదా పడటానికి అసలు కారణంగా పూజా హెగ్డే అనే వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది.

పూజా హెగ్డేపై రూమర్లు
కరోనావైరస్ పరిస్థితుల్లో రాధేశ్యామ్ షూటింగుకు హాజరుకాలేను అని పూజా హెగ్డే తెగేసి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఆ కారణంతోనే రాధేశ్యామ్ షూటింగును క్యాన్సిల్ చేసినట్టు తెలిసింది. అయితే రాధేశ్యామ్ షూటింగ్ క్యాన్సిల్ కావడానికి మరో కారణం ఉందనే విషయం తెరపైకి వచ్చింది. ప్రభాస్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో సినిమా షూటింగు క్యాన్సిల్ అయింది.

క్వారంటైన్‌లో ప్రభాస్
ప్రభాస్‌కు మేకప్ మ్యాన్‌గా వ్యవహరించే వ్యక్తికి ఇటీవల కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం తెలిసింది. దాంతో ప్రభాస్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లారు. మేకప్ మ్యాన్‌కు కరోనా సోకడంతో ప్రభాస్ షూటింగు నిలిపివేయమని నిర్మాతలను కోరారు. దాంతో ఆ షూటింగ్ క్యాన్సిల్ అయింది అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రభాస్ సినిమాల షూటింగులు రద్దు
ఇదిలా ఉండగా, ప్రభాస్ నటిస్తున్న మూడు చిత్రాలు కూడా కరోనావైరస్ కారణంగా వాయిదా పడ్డాయి. 30 రోజులపాటు షూటింగ్ జరిగిన ఆదిపురుష్, అలాగే సలార్ సినిమాలు కూడా ఇంతకు ముందే వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఆ జాబితాలోనే రాధేశ్యామ్ చేరింది.
Recommended Video

రాధే శ్యామ్‌లో నటీనటులు, సాంకేతిక వర్గం
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, సచిన్ ఖేడ్కర్, భాగ్యశ్రీ, మురళీశర్మ, కునాల్ రాయ్ కపూర్, సత్యన్, సాషా చెత్రీ తదితరులు
రచన, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్
నిర్మాత: భూషణ్ కుమార్, వంశీ, ప్రసీద
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్ (రీరికార్డింగ్)
సాంగ్స్ మ్యూజిక్: మిథున్, మనన్ భరద్వాజ్ (హిందీ), జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు)
సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: యూవీ క్రియేషన్స్, టీ సిరీస్
బడ్జెట్: 350 కోట్లు


Click it and Unblock the Notifications











