మరోసారి రెమ్యునరేషన్ డోస్ పెంచిన పూజా హెగ్డే.. ఆ ఒక్క హిట్టు పడితే..

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కొరత చాలానే ఉందని చెప్పాలి. మొన్నటివరకు హడావుడి చేసిన సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి బ్యూటీల హడావుడి మెల్లమెల్లగా తగ్గుతోంది. ఇక కొరత ఉన్న సమయంలో పూజ హెగ్డే, రష్మీక మందన్న వరుస బాక్సాఫీస్ హిట్స్ తో వారి రేంజ్ ని మరింత పెంచుకున్నారు. స్టార్ హీరోల సినిమాలు అంటే మొదట ఈ బ్యూటీలే గుర్తుకువస్తున్నారు. ఇక బుట్టబొమ్మ మరోసారి తన రెమ్యునరేషన్ రేంజ్ ని గట్టిగా పెంచేసేనట్లు టాక్ వస్తోంది. ఈ కోవిడ్ కష్టాల్లో నిర్మాతలకు ఆమె రేటు మరింత భారంగా మారింది.

గ్లామర్ డోస్ ఎప్పుడైతే పెంచిందో..

గ్లామర్ డోస్ ఎప్పుడైతే పెంచిందో..

నిజానికి పూజా హెగ్డే కూడా వరుస బాక్సాఫీస్ హిట్స్ తో క్రేజ్ పెరగడం వలన బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు భారీగానే వస్తున్నాయి. పూజా హెగ్డే గ్లామర్ డోస్ ఎప్పుడైతే పెంచిందో అప్పటి నుంచి ఆమెకు గ్యాప్ లేకుండా బడా హీరోల సినిమాల్లో అవకాశం దక్కుతోంది. డీజే సినిమాలో వేసిన బికినీ వేడి ఇంకా తగ్గలేదని చెప్పాలి. వరుస అవకాశాలతో పాటు బాక్సాఫీస్ హిట్స్ కూడా బ్యూటీ మార్కెట్ ని అమాంతం పెంచేశాయి.

ఆ హిట్టుతో ఒక్కసారిగా పెరిగిపోయింది

ఆ హిట్టుతో ఒక్కసారిగా పెరిగిపోయింది

ఈ ఏడాది కంటే ముందు కేవలం కోటి వరకు ఉన్న రెమ్యునరేషన్ ని పూజా హెగ్డే అల.. వైకుంటపురములో హిట్ అనంతరం రెండు కోట్లకు తెచ్చేసింది. అప్పుడే ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇక బాలీవుడ్ హౌజ్ ఫుల్ 4 భారీగా వసూళ్లు అందుకొని రికార్డ్ క్రియేట్ చేయడంతో నార్త్ లో కూడా అమ్మడు బిజీగా మరే ఛాన్స్ వచ్చింది. ఏకంగా సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా ఛాన్స్ కోటిగేసింది అంటే ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇక ఈ సినిమా కెరీర్ లో హీరోయిన్ పోస్ట్ అనేది చాలా పోటీతో కూడుకున్నది. ఒక ఏడాదిలో ఎంతో మంది కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. ఏ మాత్రం క్లిక్కయిన టాప్ పొజిషన్ పై ఎఫెక్ట్ తప్పదు. ఇక అందుకే అవకాశాలు ఉన్నపుడే రెమ్యునరేషన్ ని గట్టిగా గుంజుతున్నారు కొందరు భామలు. అదే బాటలో పూజా హెగ్డే కూడా రెమ్యునరేషన్ ని రూ.2.5కోట్లకు తీసుకువచ్చిందట.

బాలీవుడ్ లోన్ఇంకొక హిట్టు పడితే

బాలీవుడ్ లోన్ఇంకొక హిట్టు పడితే


చూస్తుంటే బాలీవుడ్ ఆఫర్స్ వలన ఆమె మూడు కోట్లకు కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లోన్ఇంకొక హిట్టు పడితే ఇక బుట్టబొమ్మ టాలీవుడ్ ఆఫర్స్ కి చాలా దూరంగా ఉంటుందనే డౌట్ కూడా వస్తోంది. ఇక తెలుగులో బడా నిర్మాతలకు పూజా హెగ్డే రెమ్యునరేషన్ కొంత ఆందోళన కలిగుస్తోంది. ఇప్పటికే కరోనా వలన చాలా మంది రేటు తగ్గిస్తూ ఉంటే ఇప్పుడు ఈ స్టార్ బ్యూటీ ఇలా ఒక్కసారిగా డోస్ పెంచడం హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

#Prabhas20Firstlook : Prabhas 20 Title Might Be Annouce This June!
చేతిలో ఆ రెండు సినిమాలు

చేతిలో ఆ రెండు సినిమాలు

ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి హిట్టయితే పూజా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి కూడా పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఇక అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రాజెక్టు రిలీజ్ కి సిద్ధమావుతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X