శ్రీలీల ఎగ్జిట్.. పూజా హెగ్డే ఎంట్రీ..
ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ వస్తుంది. ఈ సమయంలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టమే.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతూనే ఇండస్ట్రీలో నాలుగు రోజులు మనగుడ సాధిస్తారు. వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేస్తే మరొకరు ఆ అవకాశాన్ని దక్కించుకుంటారు. అలా టాలీవుడ్ హీరోయిన్ రిజెక్ట్ చేస్తే. మరో హీరోయిన్ అవకాశాన్ని అందిపుచ్చుకుందంట. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? ఆ హీరోయిన్స్ ఎవరు? అనేది ఓ లూక్కేయండి.
డైరెక్టర్ రమేష్ తురానీ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న మూవీ 'హే జవానీతో ఇష్క్ హోనా హై'. ఈ మూవీలో ప్రధాన హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ చేస్తోంది. సెకండ్ హీరోయిన్ గా టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల నటించనున్నారనే టాక్ వినిపించింది. మొత్తానికి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు బాలీవుడ్ లో నటించే అవకాశం కొట్టిందని, త్వరలోనే ఈ అమ్మడు షూటింగ్ లో కూడా పాల్గొన్ననున్నారనే ప్రచారం జరిగింది. కానీ, ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నట్టు తెలుస్తోంది.

శ్రీలీల.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. "పెళ్లి సందడి" సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. మాస్ మహారాజు రవితేజ 'ధమాకా' చిత్రంతో నటించింది. బాలకృష్ణ భగవాన్ కేసరి సినిమా మాత్రం శ్రీలీలకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తరువాత మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారంలో కూడా అదరగొట్టింది. తన నటనకు మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. హీరో నితిన్ రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తుంది శ్రీలీల.
అసలేం జరిగిందంటే.. శ్రీలీల ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ సంబంధించిన కాల్ షిట్స్ ను కేటాయించలేని, ఆ కారణంగా శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయాని కన్నా కాస్త ఆలస్యంగా మొదలు కావడంతో ఈ మూవీ నుంచి శ్రీలీల ఎగ్జిట్ అయిందంట. ఇలా శ్రీలీల తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి పూజా హెగ్డే వచ్చి చేరినట్లు బాలీవుడ్ టౌన్ నుంచి లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలీల ఈ మూవీలో నటించి ఉంటే.. ఇదే ఆమెకు బాలీవుడ్ ఎంట్రీ మూవీ అయ్యి ఉండేది.

ఇక పూజా హేగ్డ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వచ్చి సెటిల్ అయ్యింది. హిందీలోనే వరుస సినిమాలు చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ సరసన 'దేవా' నటిస్తోంది. ఈ మూవీతో పాటూ మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రీసెంట్ గా కోలీవుడ్ లో #Thalapathy69, Suriya44 మూవీస్ లో నటించే ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











