సమంత ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే? స్టార్ హీరోతో బుట్టబొమ్మ రెండోసారి రొమాన్స్!

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ అంతా ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గర మంచి ఆఫర్స్ ని సొంతం చేసుకొని ఇక్కడ నుంచే స్టార్డంతో మరిన్ని ఆఫర్స్ అందుకున్న వారు ఉన్న సంగతి తెలిసిందే. అలా గడిచిన ఈ పదేళ్లలో చూసుకున్నట్టయితే చాలా మంది స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్ నుంచి వెళ్లిన వారు ఉన్నారు.

కాగా వీరిలో సమంత, పూజా హెగ్డే లాంటి టాప్ స్టార్స్ ని కూడా మనం పాన్ ఇండియా మార్కెట్ కి అందించాం. అయితే ఇప్పుడు సమంత కెరీర్ పరంగా ఓ బ్రేక్ ని తీసుకుని మళ్ళీ సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. అలాగే ఇంకో పక్క పూజా హెగ్డే ఒక టైం ఫుల్ బిజీగా ఉండి ఒక్కసారిగా ఖాళీ అయ్యిపోయింది. ఇలా దాదాపు ఇద్దరూ ఒకే పరిస్థితి లోకి వచ్చేయగా ఇప్పుడు మళ్ళీ ఎట్టకేలకి బిజీగా మారుతున్నారు.

Pooja Hegde replaced Samantha Ruth Prabhu in Vijay s thalapathy69 movie

అయితే సమంత చేతిలో వెబ్ సిరీస్ లు సినిమాలు కూడా ఉన్నాయి. అందులోని మన తెలుగు ఆఫర్స్ కూడా ఉన్నాయి. కానీ పూజా హెగ్డే పరిస్థితి మాత్రం కొంచెం భిన్నం అని చెప్పాలి. పూజా హెగ్డే తెలుగులో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినప్పటికీ ఇపుడు జీరో ఆఫర్స్ లో ఆమె ఉంది. ఒక్క తెలుగు సినిమా కూడా ఇప్పుడు పూజా హెగ్డేకి లేదు కానీ తమిళ్, హిందీ సినిమాలో మాత్రం పూజా హెగ్డే ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.

కాగా తమిళ్ లో ఆల్రెడి సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో చేస్తున్న గ్యాంగ్స్టర్ రివెంజ్ డ్రామాలో ఆమె నటిస్తుండగా ఇపుడు సమంత ఆఫర్ ని పూజా హెగ్డే సొంతం చేసుకున్నట్టు కొత్త గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా సమంత హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తూ తమిళ్ లోనే భారీ ఆఫర్ ని సొంతం చేసుకున్నట్టుగా కొన్ని రూమర్స్ ఆ మధ్య వచ్చాయి.

Pooja Hegde replaced Samantha Ruth Prabhu in Vijay s thalapathy69 movie

అది కూడా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమాలో సమంత హీరోయిన్ గా చేస్తుంది అని టాక్ వచ్చింది. కానీ ఇపుడు ఇందులో కొత్త ప్రోగ్రెస్ ఏమిటంటే ఈ ఆఫర్ ని పూజా హెగ్డే కొట్టేసిందట. ఇపుడు మేకర్స్ పూజా హెగ్డేని విజయ్ సరసన అనుకుంటున్నట్టుగా దాదాపు ఖరారు చేసినట్టే తెలుస్తుంది. మరి ఇదే నిజం అయితే విజయ్ తో పూజ హెగ్డే రెండోసారి రొమాన్స్ చేయనుంది అని చెప్పాలి.

కాగా వీరి కాంబినేషన్ లో ఆల్రెడీ వచ్చిన చిత్రం "బీస్ట్" ప్లాప్ టాక్ తో కూడా మంచి వసూళ్లు అందుకుంది. కానీ అక్కడ నుంచే పూజా హెగ్డే బ్యాడ్ టైం కూడా స్టార్ట్ అయ్యింది. మరి మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కానున్నట్టు గట్టి వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈమెపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక విజయ్ లాస్ట్ సినిమాని తమిళ దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించనుండగా కన్నడ నిర్మాణ సంస్థ ఈ సినిమాని టేకోవర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X