మెగా హీరోకు ముఖం చాటేస్తున్న పూజా హెగ్డే.. మహర్షి తర్వాత నో అంటూ..
టాలీవుడ్‌లో అగ్ర హీరోలతో జత కడుతూ అందాల తార పూజా హెగ్డే దూసుకెళ్తున్నది. తాజాగా ఆమె నటించిన మహర్షి సినిమా రిలీజై భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ప్రస్తుతం ప్రభాస్‌తో జిల్ దర్శకుడు రాధాకృష్ణ రూపొందించే సినిమాలో, అలాగే త్రివిక్రమ్, అల్లు అర్జున్ చిత్రంలోనూ నటిస్తున్నది. ఆ తర్వాత వాల్మికీ సినిమాలో నటించేందుకు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మికీ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. అయితే మహర్షి తర్వాత పూజా హెగ్డే తన మనసు మార్చుకొన్నదట. ప్రస్తుతం వాల్మికి సినిమాను చేయలేనని చెప్పారట.
అల్లు అర్జున్ సినిమాతో బిజీగా ఉన్నాను. వాల్మికీకి డేట్స్ లేవు. డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం అనే సమాధానం పూజా హెగ్డే నుంచి వచ్చినట్టు సమాచారం. వాల్మికీ నుంచి తప్పుకోవడానికి అసలు కారణం వేరే ఉందనే విషయం మీడియాలో ఓ రూమర్ వైరల్ అవుతున్నది. పూజా హెగ్డేకు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ ఆమెకు నచ్చలేదట. అందుకే డేట్స్ లేవనే సమాధానం వచ్చిందనే మాట వినిపిస్తున్నది.

తమిళంలో విజయం సాధించిన జిగర్తాండ చిత్రాన్ని తెలుగులో వాల్మికీ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో సిద్దార్థ్ హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ చిత్రంగా విడుదలైంది. కానీ అంత పెద్దగా ప్రజాదరణ పొందలేదు. అలాంటి సినిమాను మళ్లీ రీమేక్ చేయడంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీగా ఆశలు పెట్టుకొన్నారు.
కాగా, పూజా హెగ్డే విషయానికి వస్తే, మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి అగ్రహీరోలతో ఆమె జతకడుతున్నది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో బిజీగా మారింది.


Click it and Unblock the Notifications











