»   » పూజా హెగ్డే చిందులు.. రంకెలట.. అందాలభామకు ‘సాక్ష్యం’ మంట!

పూజా హెగ్డే చిందులు.. రంకెలట.. అందాలభామకు ‘సాక్ష్యం’ మంట!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  దువ్వాడ జగన్నాథంలో హాట్ హాట్‌గా అందాలను ఆరబోయడంతో గ్లామర్ క్వీన్ పూజా హెగ్డేను టాలీవుడ్‌లో భారీ ఆఫర్లు చుట్టుముట్టాయి. దాంతో కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్నారు. కానీ ఇటీవల నటించిన చిత్రం సాక్ష్యం నిరాశజనకంగా మారడంతో ఆమె తన మేనేజర్, పీఆర్ బృందంపై రంకెలు వేశారట. పూజా హెగ్డే కోపానికి కారణంగా పేర్కొంటున్న విషయాలు ఇవే..

  డీజే తర్వాత వచ్చిన ఆఫర్‌తో

  డీజే తర్వాత వచ్చిన ఆఫర్‌తో

  పూజా హెగ్డే 2014లోనే ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ రావడానికి రెండేళ్లు పట్టింది. అల్లు అర్జున్‌తో నటించిన దువ్వాడ జగన్నాథంతో టాలీవుడ్‌లో స్థిరమైన కెరీర్ ఏర్పడింది. దాంతో మెల్లగా మంచి చిత్రాల ఎంపికపై దృష్టిసారించింది. అలాంటి సమయంలోనే సాక్ష్యం సినిమా ఆఫర్ ముందుకు వచ్చిందట.

  Saakshyam Movie Success Meet సాక్ష్యం సినిమా సక్సెస్ మీట్
   సాక్ష్యం ఆఫర్‌ను పూజా రిజెక్ట్

  సాక్ష్యం ఆఫర్‌ను పూజా రిజెక్ట్

  సాక్ష్యంలో సౌందర్య లహరి పాత్ర ఆఫర్‌ను తన టీమ్ ముందుకు తీసుకురాగా తొలుత నిరాకరించారట. అయితే చాలా మంచి కథ, అందులో పాత్ర కూడా బాగుంటుంది అని తన పీఆర్ టీమ్ నచ్చచెప్పి ఆఫర్‌ను ఒప్పుకునేలా చేశారట. బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన నటించడానికి పూజా హెగ్డేకు భారీ రెమ్యునరేషన్ ముట్టుందనే వార్త ప్రచారమైన సంగతి తెలిసిందే.

  సాక్ష్యం ఫ్లాప్‌తో

  సాక్ష్యం ఫ్లాప్‌తో

  తాజాగా రిలీజైన సాక్ష్యం సినిమాకు డిజాస్టర్ అనే టాక్ వినిపిస్తున్నది. సుమారు రూ.40 కోట్లతో మంచి వీఎఫ్ఎక్స్ సాంకేతికతతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే మాట వినిపిస్తున్నది. ఇలాంటి సినిమాను ఎందుకు అంటగట్టారని అంశంతో పూజా హెగ్డే తన టీమ్‌పై మండిపడ్డారట.

  పూజా హెగ్డే వార్నింగ్

  పూజా హెగ్డే వార్నింగ్

  పూజా హెగ్డే తన టీమ్‌ను గట్టిగా మందలించడమే కాకుండా ఇలాంటి సినిమాలను తన ముందుకు తీసుకురావొద్దని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారట. ఏదైనా సినిమా ఆఫర్ వస్తే అది నా కెరీర్‌కు ప్లస్ అయ్యేలా ఉండాలని చెప్పారట. దాంతో పీఆర్ టీమ్‌కు దిమ్మ తిరిగినంత పనైందనేది సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

  టాప్ సూపర్‌స్టార్లతో ఆఫర్లు

  టాప్ సూపర్‌స్టార్లతో ఆఫర్లు

  డీజే తర్వాత పూజ హెగ్డే కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిపోయింది. వంశీ పైడిపల్లి రూపొందించే మహేష్‌బాబు చిత్రంలో, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తీస్తున్న అరవింద సమేత చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నది. అలాగే ప్రభాస్ కొత్త చిత్రంలో కూడా ఆఫర్‌ను కొట్టేసినట్టు సమాచారం. ఇలా స్టార్ హీరోలతో ఆఫర్ల దక్కించుకొంటున్న సమయంలో సాక్ష్యం చిత్రం పరాజయం పొందడం పూజా హెగ్డేకు నిరాశ కలిగించే అంశమే.

  English summary
  Glamour Heroine Pooja Hegde become star heroine in Tollywood after Allu Arjun's Duvvada Jagannadham. Recently she did Sakshyam movie. After the film's failure, Pooja seemed to have lost her cool and slammed her team for bringing her such scripts. She further told them to choose only interesting films and not the cliched ones.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more