పూజా హెగ్డే రేటు తెలిస్తే షాక్.. అయినా సరే అంటూ ఆమెకే ఓటు!
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో హవా కొనసాగిస్తోంది. వరుస హిట్లతో దూకుడుమీదుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ యమా బిజీగా ఉంది. రీసెంట్‌గా ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల వైకుంఠపురములో కనిపించి అందర్నీ మెప్పించింది. పూజ నటించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుండటంతో అందరూ ఆమెకే ఓటు వేస్తున్నారు. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్..
పూజా హెగ్డే టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. అక్కడ ఇక్కడ చిత్రాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. రీసెంట్‌గా హౌస్‌ఫుల్ 4 అంటూ మంచి సక్సెస్ అందుకుంది. దీంతో అక్కడా పూజాకు బాగానే క్రేజ్ పెరిగింది.

ఇక్కడి క్రేజ్‌తో..
చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి.. ఆపై కోలీవుడ్, బాలీవుడ్ అంటూ పక్క చూపులు చూస్తారు. అక్కడ ఏదైనా తేడా కొడితే మళ్లీ ఇక్కడికేవస్తారు. ఈ జాబితాలో ఉన్న పేర్లు చెప్పుకుంటూ పోతే సమయమే సరిపోదు. తాజాగా పూజా హెగ్డే కూడా అంతే తెలుగులో వచ్చిన క్రేజ్‌ను బాలీవుడ్‌లో వాడుకుంటోంది.

సల్మాన్ చిత్రంలో ఛాన్స్..
పూజా ప్రస్తుతం ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉంది. తెలుగులో రెండు(ప్రభాస్, అఖిల్ చిత్రాల్లో), హిందీలోనూ రెండు ప్రాజెక్ట్‌లతో క్షణం తీరిక లేకుండా ఉంది. తాజాగా ఈ అమ్మడికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిత్రంలో అవకాశం వచ్చింది. అదే ఓ న్యూస్ అనుకుంటే.. పూజా డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ అంతకంటే పెద్ద వార్త అయింది.
Recommended Video

భారీ రెమ్యూనరేషన్..
సల్మాన్ హీరోగా రాబోతోన్నకభీ ఈద్ కభీ దివాలి చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంచుకున్నారట. ఈ మూవీకి గానూ పూజా.. నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పూజకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు ఒప్పుకున్నారట.


Click it and Unblock the Notifications











