అప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు మహేష్‌తో.. మళ్లీ జిగేల్ రాణిగా పూజాహెగ్డే

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసేందుకు సిద్దమవుతున్నారట. అదేంటి! మహేష్.. మరో కొత్త సినిమా స్టార్ట్ చేశాడా? అనుకోకండి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోనే ఈ ఇద్దరూ రొమాన్స్ చేయబోతున్నారట. ఇంతకీ అసలు విషయమేంటి? అనేగా మీ డౌట్.. అక్కడికే వస్తున్నాం చూడండి.

మహేష్ బాబుతో పూజాహెగ్డే.. మరింత రెచ్చిపోయేందుకు

మహేష్ బాబుతో పూజాహెగ్డే.. మరింత రెచ్చిపోయేందుకు

ఇటీవలే మహేష్ బాబు 25వ సినిమా 'మహర్షి'లో పూజాహెగ్డే నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె గ్లామర్ డోస్ కొంతవరకు ఉన్నప్పటికీ, సామాజిక కోణంలో వచ్చిన సినిమా కావడంతో ఆ డోస్ పెద్దగా అట్రాక్ట్ చేయలేదు. కానీ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. మహేష్, పూజా ఇద్దరికీ క్రెడిట్ దక్కింది. దీంతో ఈ సారి మహేష్ బాబు మరింతగా రెచ్చిపోయి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోందట పూజా.

'సరిలేరు నీకెవ్వరు'లో ఐటెం సాంగ్..

'సరిలేరు నీకెవ్వరు'లో ఐటెం సాంగ్..

మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలో ప్రేక్షక లోకానికి పూనకం తెప్పించేలా ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట దర్శకనిర్మాతలు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో భాగం గానే మరికొద్ది రోజుల్లోనే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నారట మేకర్స్.

తమన్నా అనుకున్నారు కానీ.. చివరకు ఆమెతో

తమన్నా అనుకున్నారు కానీ.. చివరకు ఆమెతో

ముందుగా ఈ ఐటెం సాంగ్‌లో తమన్నా చిందులేస్తుందని టాక్ వినిపించింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు పూజాహెగ్డేతో ఈ ఐటెం సాంగ్ త్వరలోనే సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది. ఈ మేరకు పూజాతో సంప్రదింపులు కూడా జరిగాయని, రెమ్మ్యూనరేషన్ కూడా బాగానే ఆఫర్ చేశారని సమాచారం. మరోవైపు మహేష్‌తో రెచ్చిపోయి చిందులేయాలని పూజా కూడా ఆతృతగా ఉందని టాక్ నడుస్తోంది.

 గతంలో రామ్ చరణ్.. ఇప్పుడు మహేష్

గతంలో రామ్ చరణ్.. ఇప్పుడు మహేష్

గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'రంగస్థలం' సినిమాలో జిగేల్ రాణి అంటూ ఓ రేంజ్‌లో చిందులేసింది పూజాహెగ్డే. ఊపు తెప్పించే సాంగ్ వస్తుంటే.. ఆకట్టుకునే ఒంపుసొంపులతో ఆమె ఇచ్చిన జోష్ థియేటర్లను హోరెత్తించింది. సో ఇప్పుడు అంతకుమించి మహేష్‌ బాబుతో పర్‌ఫార్మ్ చేయించి.. ప్రేక్షకులకు పూజా అందాల విందు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మహేష్ యూనిట్ అంతా. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో!.

సరిలేరు నీకెవ్వరు మూవీ

సరిలేరు నీకెవ్వరు మూవీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X