పూజ హెడ్గేపై బన్నీ కన్ను పడింది, ఇక మెగా హీరోలతో...!
హైదరాబాద్: ‘ముకుంద' చిత్రంలో వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేసిన కన్నడ భామ పూజా హెడ్గే....మెగా ఫ్యామిలీ దృష్టిలో పడింది. ఆకట్టుకునే అందంతో పాటు మెప్పించే పెర్పార్మెన్స్, చిలిపి తనంతో కూడిన ఆటిట్యూడ్ పూజా హెడ్గేకు మంచి అవకాశాలు తెచ్చి పెడుతోంది. తెలుగులో నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం' సినిమా చేసిన పూజ తొలి చిత్రంతోనే టాలీవుడ్లో తనదైన ముద్ర వేసింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెడ్గేకు మరో మెగా హీరోతో చేసే అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న దర్శకుడు కొరటాల శివ....దీని తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెడ్గేను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీకి పూజా హెడ్గే తగిన జోడీ అవుతుందని అంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. అదే నిజమైతే పూజా హెడ్గే స్టార్ హీరోయిన్ కావడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు.
ఇటీవలే కొరటాల శివ బన్నీకి స్టోరీ చెప్పాడని, స్క్రిప్టు నచ్చడంతో బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. కొరటాల శివ మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. ఇద్దరు ప్రస్తుతం ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టనున్నారు.


Click it and Unblock the Notifications











