సునీల్ 'పూలరంగడు'మళయాళ చిత్రం కాపీ
సునీల్, ఇషాచావ్లా జంటగా నటిస్తున్న చిత్రం 'పూలరంగడు'ఓ మళయాళ చిత్రానికి కాపీ అంటూ గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.వారు చెప్పే దాని ప్రకారం..మళయాళ కామిడీ హీరో దిలీప్ నటించిన పండిప్పడ అనే ఈ చిత్రం 2005 లో వచ్చింది.నవ్య నాయిర్,ప్రకాష్ రాజు,రాజన్ పి.దేవ్ నటించిన ఈ చిత్రం అక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు.దిలీజ్ కున్న ఇమేజ్ తో ఓపినింగ్స్ తెచ్చుకోగలిగినా ఈ చిత్రం పెద్దగా ప్రేక్షదారణ పొందలేదు.
స్లాఫ్ స్టిక్ కామిడీతో నడిచే ఈ చిత్రం ఈ చిత్రంలో హీరో తనకున్న అప్పులు తీర్చుకోవటం కోసం ఓ మారు మూల గ్రామంలో ఉన్న తన ఆస్ధి అయిన చిన్న స్ధలాన్ని అమ్మకోవటానికి బయిలు దేరతాడు.అయితే ఆ భూమి ఇద్దరు భూస్వామిలు మధ్య నలుగుతూంటుంది.వీరిద్దరకీ సమన్వయం కుదిర్చి ఆ భూమిని అమ్మటానికి ఆ గ్రూప్ లో ఒకదాంట్లో జాయిన్ అవుతాడు.అంతేగాక ఆ భూస్వామిలో ఒకరి కూతురు తో ప్రేమలో కూడా పడతాడు.మరో ప్రక్క ఆమెను పెళ్లి చేసుకోవాలని రైవల్ గ్రూప్ భూస్వామి కోరుకుంటూంటాడు.వీళ్లిద్దరు మధ్యా హీరో నలిగిపోతూ ఎలా తన సమస్యను తీర్చుకున్నాడనేది మిగతా కథ.
గతంలోనూ వీరభద్రం డైరక్ట్ చేసిన అహనా పెళ్లంట చిత్రం కొరియన్ కామిడీ మ్యారీయింగ్ మాఫియా ఆధారంగా రూపొందింది.ఇక పూల రంగడు చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ సమర్పిస్తోంది. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతోంది. వీరభద్రం దర్శకుడు. ఈ చిత్రాన్ని జనవరి సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఈ చిత్రం కాపినా లేక ఒరిజనల్ ధాటా అన్నది తేలాలంటే సినిమా విడుదల అయ్యేవరకూ ఆగాల్సిందే.
సునీల్, ఇషాచావ్లా, కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృథ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: నాగేంద్ర, మాటలు: శ్రీధర్ సీపన, కూర్పు: గౌతంరాజు, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీ మేకర్స్, నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రం.


Click it and Unblock the Notifications











