భీమవరంలో పూలరంగడు ఎఫెక్టు
సునీల్ నేటివ్ ప్లేసైన భీమవరంలో పూలరంగడు చిత్రానికి విపరీతమైన ప్రజాదరణ దక్కుతోంది. అక్కడ సునీల్ సిక్స్ ప్యాక్ బాడీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాంతో అక్కడ కుర్రాళ్లు కొందరు తమ డిఎన్ ఆర్ కాలేజీలో ఓ జిమ్ ని ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆ జిమ్ కు పూలరంగడు జిమ్ అనే పేరు పెట్టి, అందులో సునీల్ సిక్స్ ప్యాక్ ఫోటోలు పెట్టనున్నారని వార్త. ఇక ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో కాక బయట కూడా సునీల్ సిక్స్ ప్యాక్ హాట్ టాపిక్ గా మారింది.
క్లైమాక్స్ లో వచ్చి సిక్స్ ప్యాక్ ఫైట్ సునీల్ కు బాగా పేరు తెచ్చిపెట్టింది. దానికి తోడు సునీల్ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తమ సిక్స్ ప్యాక్ కోచ్ ని తీసుకుని వెళ్లి మరీ టీవి ఛానెల్స్ వద్ద తన బాడీ గురించి విజువల్స్ చూపుతూ లైవ్ ఇస్తున్నారు. ఇక సునీల్ సిక్స్ ప్యాక్ కోసం కష్టబడ్డ విధానంతో చేసిన వీడియా ఒకటి నెట్ లో విడుదల చేసారు. అది కూడా యూ ట్యూబ్ లో పాపులర్ అవ్వూతూ సునీల్ కి మంచి క్రేజ్ తెచ్చిపెడుతోంది. సినిమాలో కామెడీ కన్నా కూడా సునీల్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అలాగే సునీల్ తన తదుపరి చిత్రాల్లో కూడా ఇదే సిక్స్ ప్యాక్ తో చేసే పాత్రలు చేయటానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











