ఇడియట్ హీరోతో కలిసి మళ్ళీ పనిచేయటానకి పూరీ జగన్ ప్లాన్స్
పూరీ జగన్నాధ్, రవితేజ కెరీర్ ల రెండింటినీ డిసైడ్ చేసి నిలబెట్టిన చిత్రం ఏదంటే ఇడియట్ అనే ఎవరైనా కళ్ళు మూసుకుచెపుతారు. ఆ తర్వాతే రవితేజ కు ఎన్నిహిట్స్ వచ్చి హీరోగా నిలబడ్డా,పూరీ పోకిరి లాంటి సినిమాలను డైరక్ట్ చేసినా అంటారు.అయితే ఈ ఇద్దరూ నేనింతే వంటి మెగా ప్లాఫ్ చిత్రం తర్వాత కలిసి పనిచేయలేదు.పూరీ వరసగా ప్లాఫ్స్ ఇచ్చుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తూంటే,రవితేజ తన మార్కట్ ని పెంచుకుంటూ వరస సినిమాలు చేసేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తన్నారు.
అయితే ఇప్పుడు మళ్ళి వీరిద్దరూ కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.తనకు ఇడియట్ తో లైఫ్ ఇచ్చిన దర్శకుడుకి మళ్ళీ హిట్ ఇచ్చి ప్లాపుల్లోంచి బయిటకు తీయాలని రవితేజ ఈ ఆఫర్ తో పూరీ కలిసి ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. గతంలో రవితేజతో పెద్ద హిట్ ఇచ్చిన నిర్మాణ సంస్ధ ఈ కాంబినేషన్ ని క్యాష్ చేసుకోవటానికి పావులు కదుపుతోందని చెప్తున్నారు.కథ ఇడియట్ కి సీక్వెల్ గా ఉంటుందంటున్నారు.అదీ సంగతి.


Click it and Unblock the Notifications











