పూరీ జగన్నాధ్ కొత్త చిత్రం 'దేముడు చేసిన మనుషులు'
పూరి జగన్నాధ్, రవితేజ కాంబినేషన్ లో ఇడియట్ -2 అనే చిత్రం తెరకెక్కనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పూరీ జగన్నాధ్ ఆ నిర్ణయం మార్చుకున్నారు. దేముడు చేసిన మనుషలులు టైటిల్ తో ఓ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. డివివి దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం పూర్తి కామిడీగా రూపొందనుంది. ఇక ఈ చిత్రాన్ని మే నెల నుంచి సెట్స్ కు వెళ్లనుంది. ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ ఇప్పటికే మొదలైంది. గతంలో ఇదే టైటిల్ తో కృష్ణ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందింది.
ఇక రవితేజ, పూరీ కాంబినేషన్ లో గతంలో ఇడియట్,అమ్మా..నాన్న..తమిళ అమ్మాయి,ఇట్లు శ్రావణి..సుబ్రమణ్యం,నేనింతే చిత్రాలు తెరకెక్కియి. వీరిద్దరి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కావటంతో ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వస్తోంది. అలాగే పూరీ జగన్నాధ్ తాజా చిత్రం బిజినెస్ మెన్ కూడా సూపర్ హిట్ కావటంతో మార్కెట్లో ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్,మిగతా సాంకేతికగణం వివరాలతో పూరీ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











