సాహోలో క్రేజీ ఐటమ్... ప్రభాస్‌తొ ప్రముఖ పాప్‌స్టార్.. వందలాది బ్రెజిల్ డ్యాన్సర్లు!
బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎల్లలు దాటిపోయింది. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సాహో చిత్రంలో నటిస్తున్నాడు. పిరియాడిక్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది సాహో గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మీడియాలో పతాక శీర్షికలుగా మారుతున్నాయి. తాజాగా ప్రభాస్ మూమీ కోసం చిత్రీకరించే ఐటమ్ సాంగ్ కోసం పాపులర్ పాప్‌స్టార్‌ను రంగంలోకి దించుతున్నారట. వివరాల్లోకి వెళితే..

సాహోలో క్రేజీగా ఐటమ్ సాంగ్
సాహో చిత్రంలో భారీ ఎత్తున ఐటెమ్ సాంగ్ పిక్చరైజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు కనివినీ ఎరుగని రీతిలో సెట్లు, భారీస్థాయిలో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారట. ఈ పాటలో వందలాది బ్రెజిల్ డ్యాన్సర్లు పాల్గొంటారని చిత్ర యూనిట్ వెల్లడించింది. జాతర నేపథ్యంగా వచ్చే పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ నృత్యాలు సమాకూర్చనున్నారు.

ప్రముఖ పాప్‌స్టార్ బెయాన్స్
ఇక పాట కోసం ప్రముఖ పాప్‌స్టార్ బెయాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారబోతున్నారు. బ్లో, జెలస్ లాంటి నంబర్లతో పాప్ అభిమానులకు బెయాన్స్ పిచ్చెక్కించిన సంగతి తెలిసిందే. సాహో కోసం చిత్రీకరించే పాటలో ప్రభాస్‌తో స్టెప్పులు వేయడానికి సిద్దమవుతున్నట్టు తెలిసింది.

రెండు విభిన్నమైన పాత్రల్లో ప్రభాస్
సాహో సినిమా కథ విషయానికి వస్తే.. స్వాతంత్ర్య పూర్వం, సమకాలీన అంశాలతో జరిగే స్టోరీతో దర్శకుడు సుజిత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారనే టాక్. స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంగా సాగే కథ కారణంగా ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

టాలీవుడ్‌కు బాలీవుడ్ తారల దిగుమతి
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రం బడ్జెట్ రూ.150 కోట్లు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ తారలు శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేష్, జాక్రీ ష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, టిన్ను ఆనంద్, మందిరా బేడి తదితరులు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











