Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
బింబిసారను దక్కించుకున్న ప్రముఖ టీవీ ఛానల్.. భారీ రేటు పెట్టి మరీ!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నుంచి రానున్న బింబిసార సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేసు. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 5న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక బింబిసార సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే విధంగా ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బింబిసార, వశిష్ట్ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ హిస్టారికల్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే ఒక స్పెషల్ సాంగ్ లో వరీనా హుసేన్ నర్తించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బింబిసార అనే పవర్ ఫుల్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడనే విషయం మీద క్లారిటీ అచ్చేసింది. దానికి తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇటీవలే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆయన సినిమా చూసిన తరువాత మాట్లాడిన మాటలు సినిమా మీద మరింత అంచనాలు పెంచాయి.
ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కొసరాజు హరికృష్ణ నిర్మించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించగా వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలలో నటించారు. కల్యాణ్ రామ్ 'బింబిసారా' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 6.50 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 13.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది..ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటుకు జీ తెలుగు సంస్థ దక్కించుకుందని సమాచారం.