మురళీ మోహన్‌పై పోసాని తడాఖా

By Bojja Kumar

తన దృష్టిలో తప్పు అనిపిస్తే...ఎవరినైనా సరైన తన మాటలతో కడిగి పారేస్తూ, తన విచిత్రమైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు మోసాని కృష్ణ మురళి తాజాగా మరోసారి వార్తల్లో వ్య్తక్తి అయ్యాడు. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో గత కొన్ని రోజులుగా ఓ సమస్య సమస్యగానే మిగిలి పోయింది. పలువురు హీరోయిన్లు, ముఖ్యంగా ఉత్తరాది నుంచి వచ్చిన వారు 'మా'లో సభ్యత్వం తీసుకోకుండానే ఎంచక్కా సినిమాల మీద సినిమాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ విషయమై పలు సార్లు 'మా' సదరు హీరోయిన్లకు నోటీసులు కూడా జారీ చేసింది. 'మా' అధ్యక్షుడు మురళీ ఈ విషయమై వారిని మీడియా ముఖంగా హెచ్చరించారు కూడా. అయితే మురళీ మోహన్ హెచ్చరికలను ఎవరూ పట్టించుకోలేదు సరికాదా....జెనీలియా లాంటి వారు ఏం చేస్తారో చేసుకోండి అనే రేంజ్‌లో రిప్లయ్ ఇచ్చారు.

ఈ వియమై పోసాని కృష్ణ మురళీ స్పందిస్తూ.....మురళీ మోహన్ లా మెత్తగా ఉంటే ఎవరూ వినరని, గట్టిగా మాట్లాడితేనే మాట వింటారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నేను ఆయన స్థానంలో ఉండి ఉంటే నా తడాఖా చూపించే వాడినని..తీవ్ర పదజాలంతో అన్నట్లు సమాచారం. పోసాని ఇలా వ్యాఖ్యానించడం వెనక చాలా పెద్ద అర్థం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మురళీ మెహన్ కు 'మా' బాధ్యతలు చేపట్టడం చేతకావడం లేదని, తనకు అప్పగిస్తే పని తనం చూపిస్తాను అనే విధంగా పోసాని తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది. మరి పోసాని ఇలా అన్న విషయం మరళీ మోహన్ కు తెలుసో? తెలియదో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X