పోసాని తో మహేష్ బాబు...సీన్ కేక
హైదరాబాద్ : శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న "ఆగడు" చిత్రంలో ఇంటర్వెల్ ముందు ఓ పది నిముషాలు పాటు ఓ ఎపిసోడ్ అదిరిపోతుందని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ లో మెయిన్ హైలెట్ మెంటల్ కృష్ణ గా పేరొందిన పోసాని కృష్ణ మురళి అని సమాచారం. చిత్రంలో ఆయన పాత్ర చిన్నదైనా సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 19న విడుదల అయ్యే ఈ చిత్రం మహేష్ కు మరో బ్లాక్ బస్టర్ చిత్రం అవుతుందని చెప్తున్నారు.
కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కు మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ స్వరాలందిస్తున్నారు.

'ఆగడు' టీజర్ లో మహేష్ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్ మొత్తం హుషారుగా సాగిపోయింది.
పంచ్ డైలాగు లేకపోతే.. టీజర్, ట్రైలర్ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం పంచ్‌లపైనే పంచ్ వేసేశాడు. 'ఆగడు' టీజర్‌లో. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











