పోసాని మన్మధలీల?
రచయిత,నటుడు,దర్శకుడు పోసాని కృష్ణమురళి తాజాగా జెంటిల్ మెన్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం కమల్ హాసన్ అప్పట్లో నటించి,విజయం సాధించిన మన్మధలీల చిత్రం ఆధారంగా స్క్రిప్టు రూపుదిద్దుకుంటోందని వినపడుతోంది. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో కమల్ కి జోడిగా జయప్రధ నటించగా ఘన విజయం సాధించింది. ఇప్పటి కాలానికి దానని మార్చి పోసాని దీనిని తీర్చి దిద్దినట్లు చెప్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా ఆధునిక వివాహ వ్యవస్ధ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతోందనే విషయం చర్చిస్తారని తెలుస్తోంది. ఇక ఆపరేషన్ దుర్యోధన అనంతరం పోసాని దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు విజయం సాధించకపోవటంతో దీనిని ఛాలెంజ్ గా తీసుకుని రూపొందిస్తున్నారంటున్నారు. పోసాని ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ ఆయనకు జోడిగా చేస్తోంది. ఓ సెల్ ఫోన్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనుందని సమాచారం. పోసాని ఈ చిత్రంలో ఓ కార్పోరేట్ కంపినీలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తూంటాడు.మంచి విలాసవంతమైన జీవితం గడుపుతున్న అతనికి మంచి భార్య కూడా ఉంటుంది. అయితే అతనికి వైరటీలు చూడాలనే కోరికతో బయిట తిరుగుళ్ళుకు అలవాటు పడతాడు. అతనిలో వచ్చిన సడన్ ఛేంజ్ గమనించిన అతని భార్య అతనికి ఎలా బుద్ది చెప్పిందనేది కథ అని తెలుస్తోంది. నాళం పద్మజ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెలలోనే రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











