దాసరిని దుమ్మెత్తుతూ పోసాని

ఇక పోసాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు రామోజీ ఫిలిం సిటిలో శరవేగంతో జరుగుతున్నాయి. ఈ చిత్రం కథ గురించి పోసాని శాసన సభ పుట్టిన దగ్గర నుంచి దానికి ఎన్నికయిన ఎందరెందరో నాయకులు ప్రజలకు రకరకాలుగా వాగ్దానాలు చేసి చట్ట సభలలోకి అడుగుపెడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఆ వాగ్దానాలను అమలు చేసిన వారెవరూ లేరు. ప్రజలను తమ మాటలతో వంచిస్తున్న రాజకీయనాయకుల గురించి, రాజకీయాల గురించి ఈ సినిమాలో చర్చిస్తున్నాం అన్నారు.
రాజకీయాలలో సేవకులే కానీ నాయకులు ఉండరు, ప్రజలనే నాయకులు అని ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తే చేపల చెరువు పెట్టుకుని మీడియా సహకారంతో అన్యాయాలను ప్రతిఘటించే పాత్ర ఇది అని చెప్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఒక పార్టీని కానీ, వ్యక్తులను కానీ విమర్శించే విధంగా చిత్రం ఉండదని చెప్పుతున్నారు. దాసరి కూడా అలాగే చెప్పి సినిమా తీసారు. కానీ చివరకు చిరంజీవిపై డైరక్టుగా విమర్శలు గుప్పించారు.


Click it and Unblock the Notifications











