పోసానికి మంత్రి పదవి దక్కబోతోందా? పృథ్వి కామెంట్స్ హాట్ టాపిక్

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు, పార్టీకి మద్దతుగా ఉంటూ విజయంలో ప్రధాన భూమిక పోషించిన వారికి తగిన న్యాయం చేస్తూ వస్తున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి తనకు సపోర్ట్ చేస్తూ పార్టీ తరుపున ప్రచారం చేసిన పృథ్విరాజ్, అలీకి ఇప్పటికే కేబినెట్ స్థాయి పదవులు కట్టబెట్టారు. అయితే వీరి కంటే ముందు నుంచే వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉంటూ... నేరుగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించిన పోసాని కృష్ణ మురళికి ఇప్పటికీ ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా పోసానిపై పృథ్వి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయింది.

అన్నకు మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు

అన్నకు మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు

ఇటీవల ప్రెస్ మీట్లో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వి విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ... పోసాని అన్నకు మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో త్వరలో పోసానికి మంత్రి పదవి దక్కబోతోందనే ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఇస్తే పెద్ద పదవి ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నారా?

ఇస్తే పెద్ద పదవి ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నారా?

పృథ్వికి కట్టబోట్టిన ఎస్వీబీసీ చైర్మైన్, అలీకి ఇచ్చిన ఎఫ్‌డిసి చైర్మన్ ఇచ్చిన పదవులు కేబినెట్ ర్యాంకు ఉన్నవే. ఇపుడు పోసానిని ఏకంగా కేబినెట్లోకి తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఆయనకు ఏ పదవి ఇవ్వక పోవడానికి కారణం.... ఆయనన్ను మంత్రి వర్గంలోకి తీసుకునే ఆలోచన ఉండబట్టే అనే ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్సీ చేసి ఆపై మంత్రి పదవి చేస్తారా?

ఎమ్మెల్సీ చేసి ఆపై మంత్రి పదవి చేస్తారా?

పోసాని ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఈ నేపథ్యంలో ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి వర్గంలోకి తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నారట. అయితే పోసానిని ఇప్పుడే మంత్రిని చేస్తారా? లేక రెండున్నరేళ్ల తర్వాత జరిగే కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా? అనే చర్చ పార్టీలో జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో పోసాని ఏమన్నారంటే...

గతంలో పోసాని ఏమన్నారంటే...

తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని, జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే తాను మద్దతు తెలిపినట్లు పోసాని గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. మరి జగన్ పిలిచి మంత్రి పదవి ఇస్తే స్వీకరిస్తారా? లేదా? అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X