తారా చౌదరి సెక్స్ బాగోతంపై పోసాని సినిమా!
హైదరాబాద్: దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి గురించి...ఆయన సినిమాల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. పోసాని దర్శకత్వం వహించే చిత్రాలు చాలా మందికి అతిగా అనిపించినా అతని చిత్రాలు కోసం ఎదురుచూసే ప్రేక్షకుల సంఖ్య తక్కువేం కాదు. తాజాగా ఆయన మరో ఆసక్తికరమైన అంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
'ఓ తారా.. చంద్రులెందరో..' పేరుతో రూపొందే సినిమాకు పోసాని దర్శకత్వం వహిస్తున్నారు. సెక్స్ వ్యాపారం చేస్తూ పోలీసులకు చిక్కిన తారా చౌదరి, ఆమెను వాడుకున్న పొలిటీషియన్స్, అధికారుల బండారాన్ని ఆయన ఈ చిత్రంలో తెరపై చూపించబోతున్నారని తెలుస్తోంది.
తన పతనానికి ఓ నటుడే కారణమంటూ వ్యభిచారం కేసులో అరెస్టయిన నటి తారా చౌదరి ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి. తన భర్తను సంతోషపెట్టడానికి తారా చౌదరిని ఓ నటి పిలిపించేదని అంటున్నారు. ఈ విషయాన్ని తారా చౌదరి పోలీసులకు చెప్పినట్లు గతంలో ఓ ఆంగ్లదినపత్రిక రాసింది. ఆ పాయింట్ ను కూడా పోసాని తన సినిమాలో ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. పోసాని ఇందులో లాయర్ పాత్రలో నటిస్తున్నారు. తారా చౌదరి పాత్రకు ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అనేది త్వరలోనే తెలియజేయనున్నారు. తన చిత్రాలతో సంచలనాలు సృష్టించే పోసాని ఈ చిత్రంతో ఏం హడావుడి చేస్తారో అని అంతా అసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











