సెక్స్ స్కామ్స్ టార్గెట్‌గా.. పోసాని సినిమా
సంచలనమైన అంశాలను, కుళ్లు రాజకీయాలను తన సినిమాల్లో చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు పోసాని కృష్ణమురళి. 'దుశ్శాసన" తర్వాత పోసాని మరో ప్రాజెక్టు మొదలు పెట్టలేదు. అలా అని ఆయన ఖాళీగా కూర్చున్నాడనుకుంటే పొరపాటే. పోసాని మరో ఆసక్తి కరమైన అంశంతో పోలీసుల ముందుకు రాబోతున్నారు. ఇందు కోసం చాలా కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
పోసాని సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆయన గత కొంత కాలంగా దేశంలో, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సెక్స్ స్కాంలు, సెల్రబిటీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలు తదితర అంశాలను బేస్ చేసుకుని కథను తయారు చేసుకుంటున్నారని తెలిసింది. నిత్యానంద, ఎన్డీ తివారి, అంబటి రాంబాబు, ఎబిఎన్ రాధాకృష్ణ, ఎపి చరణ్ తదిరులను పోలిన పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుందట.
వాస్తవంగా జరిగిన అంశాలు కావడంతో ఈ సినిమా ప్రేక్షఃకుల్లో ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంటుందని, ఆపరేషన్ దుర్యోధన తర్వాత పెద్ద హిట్లు లేని పోసాని, ఈ సినిమా ద్వారా మరోసారి తన సినిమా పవర్ ఏమిటో చూపించడానికి సిద్ధం అవుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.


Click it and Unblock the Notifications











