నా సినిమాకి జీరో రేటింగా..కనీసం పాయిట్ ఫైవ్ కూడా లేదా..?
ఎలాంటి చెత్త చిత్రమొచ్చినా కానీ కనీసం రెండు లేదా మూడు రేటింగులిచ్చే వెబ్ సైట్లు తన సినిమాలకి మాత్రం సున్నా రేటింగులిస్తున్నాయంటూ పోసాని కృష్ణమురళి ఆక్రోశిస్తున్నాడు. కనీసం పాయింట్ ఫైవ్ లేదా ఒకటి రేటింగులైనా ఇవ్వకుండా తన చిత్రాలని సున్నాకి పరిమితం చేస్తున్నారని సన్నిహితుల వద్ద మండిపడుతున్నాడు. తన సినిమాలకి ప్రత్యేకమైన అభిమానులున్నారని, వారు తన సినిమాల్నిఆదరిస్తున్నారని, అది తెలుసుకుని అయినా సదరు రేటింగులిచ్చే వాళ్లు కళ్లు తెరవాలని పోసాని అంటున్నాడట.
త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి సున్నా రేటింగులిచ్చిన వాళ్లపై చిన్నపాటి ధర్నా చేస్తానని హెచ్చరిస్తున్నాడట. దుశ్శాసన సినిమా కలెక్షన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారికి అంకెలతో సమాధానం చెబుతాడట. అంతే కాక ఈ ఏడాదిలో సినిమాలు, వాటికిచ్చిన రేటింగులు, వాటికొచ్చిన కలెక్షన్లు కూడా ఏకరువు పెట్టి తన సినిమాకి సున్నా వేసిన వారి పరువు తీస్తానంటూ చిందులు తొక్కుతున్నాడట. అయితే పోసాని బేసిక్ గా ఒక సంగతి మర్చిపోతున్నాడు. అసలు తన సినిమాని చూడడమే ఎక్కువ. అలాంటిది చూసి, దానికి రివ్వూ కూడా రాస్తున్నారని సంతోషించక దానికిచ్చిన రేటింగ్ తక్కువయిందని ఏడిస్తే ఎలా?


Click it and Unblock the Notifications











