‘ఎందుకంటే ప్రేమంట’ టాక్ ఏంటి? కాపీ చిత్రమా?
రామ్, తమన్నా జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం రేపు(జూన్ 8)న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈచిత్రం హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రం 'హెవెన్' చిత్రాన్ని ఆధారం చేసుకున్ని రూపొందిస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. హాలీవుడ్ సినిమాలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీయడం కామనే కాబట్టి ఈ విషయం పెద్ద మైనస్ పాయింట్ కాదనే చెప్పాలి.
సినిమా టాక్ విసయానికొస్తే...ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కరుణకరణ్ దర్శకత్వంలో వచ్చే సినిమా అంటే...మంచి అంచాలుంటాయి. ప్రేమకథా చిత్రాలను కరుణాకరన్ ఎంతబాగా తీస్తారో ఆడియన్స్‌కి బాగా తెలుసు. ఒక వైపు నవ్వుతూనే ఉంటాం...మరో వైపు ఏదో తెలియని ఫీలింగుతో హార్ట్ టచ్చింగ్‌గా ఉంటాయి ఆయన సినిమాలు.
'ఎందుకంటే ప్రేమంట' చిత్రం కూడా అదే రేంజిలో ఉంటుందని అంటున్నారు. ఇక రామ్ ఎనర్జిటిక్ నటన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన నటించిన సినిమాలన్నీ మినిమమ్ గ్యారంటీ. తమన్నా గ్లామర్, పెర్ఫార్మెన్స్ కూడా ఈ చిత్రానికి ప్లస్సవుతుందనే అంటున్నారు. ఇలా విడుదలకు ముందు నుంచే ఈచిత్రం మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ఎలాంటి కత్తిరింపులు లేకుండా క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే కుటుంబ సమేతంగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఫైనల్ రిజల్ట్ ఏమిటో రేపు తేలనుంది. స్రవంతి రవి కిషోర్ స్రవంతి మూవీస్ బేర్‌పై నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.


Click it and Unblock the Notifications











