గబ్బర్ సింగ్-2ను గబ్బులేపుతున్నారు!
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘గబ్బర్ సింగ్-2' చిత్రం గురించి ఇప్పటి వరకు ఎన్ని రకాల వార్తలు విన్నామో లేక్కే లేదు. అదిగో ఇదిగో అంటే దాదాపు సంవత్సరం పాటు నెట్టుకొచ్చారు. హీరోయిన్ దొరకడం లేదని కొన్నాళ్లు, స్క్రిప్టు సరిగా లేదని ఇంకొన్నాళ్లు, పవన్ కళ్యాణ్ రాజకీయాలని మరికొన్నాళ్లు, గోపాలా గోపాలా వల్లే అంటే ఇంకొన్నాళ్లు కాలం గడిపారు.
ఆ మధ్య ఈచిత్రం నుండి సంపత్ నంది తప్పకున్నారని, పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన విధంగా స్క్రిప్టు మార్పులు చేసి తానే డైరెక్షన్ చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మరో వార్త ఫిల్మ్ నగర్లో ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ‘పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు. మరి ఈ ప్రచారం అయినా నిజం అవుతుందో? లేదో?

ఎప్పుడో ఈ చిత్రం మొదలు కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ వివిధ కారణాలతో సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం నవంబర్లో సెట్స్ మీదనకు వెళ్ల బోతోంది. సినిమా ఆలస్యానికి కారణం తానే కాబట్టి గబ్బర్ సింగ్ 2 టీంను వెయిట్ చేయించినందుకు క్షమాపణలు కోరడానికి సిద్దమయ్యారట పవన్. అపాలజీ కోరడం ఆయన మంచి మనసుకు నిదర్శనం అంటున్నారు.
'నాక్కొంచెం తిక్కుంది...' అంటూ గబ్బర్ సింగ్‌గా పవన్ కల్యాణ్ చేసిన హంగామా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు 'గబ్బర్ సింగ్'కి రెండో భాగం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్లు అని తెలుస్తోంది. ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్ నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











