»   » త్రివిక్రమ్ మూవీ షూటింగులో పొలిటికల్ లొల్లి, కమెడియన్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్?

త్రివిక్రమ్ మూవీ షూటింగులో పొలిటికల్ లొల్లి, కమెడియన్‌పై పవన్ కళ్యాణ్ ఫైర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత సాఫ్ట్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయనకు సాధారణంగా కోపం రాదు... ఒకవేళ కోపం వచ్చిందంటే అవతలి వ్యక్తి బాగా ఇబ్బంది పెట్టడమో? లేక సమయం సందర్భం లేకుండా అనవసర విషయాలు మాట్లాడటం జరిగినపుడు మాత్రమే పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురవుతారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్న మూవీ షూటింగులో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్..... సెట్లో ఓ కమెడియన్ మూలంగా ఇబ్బంది పడ్డాడని, సమయం సందర్భం లేకుండా కొన్ని విషయాలు అడగటంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

మూవీ షూటింగులో కమెడియన్ మీద పవన్ కళ్యాణ్ చిందులు తొక్కాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

పవన్-త్రివిక్రమ్ మూవీలో నటిస్తున్న ఓ కమెడియన్ షూటింగ్ గ్యాప్ లో జనసేన విధివిధానాలు అడిగే ప్రయత్నం చేశాడని, షూటింగ్ స్పాట్లో ఇలాంటి విషయాలు అడగటంతో పవన్ సీరియస్ అయ్యాడని టాక్.

ఎక్కడి పనులు అక్కడే చేయాలి

ఎక్కడి పనులు అక్కడే చేయాలి

సినిమా షూటింగులో రాజకీయాల ప్రస్తావన తెచ్చి ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టవద్దు, ఎవరి హద్దుల్లో వారు ఉండాలంటూ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది.

ఆ కమెడియన్ ఎవరు?

ఆ కమెడియన్ ఎవరు?

ఆ కమెడియన్ పేరు మాత్రం బయటకు రాలేదు. అతడు ఇంతకు ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ' చిత్రంలో కూడా నటించాడని తెలుస్తోంది.

English summary
Reports state that Pawan Kalyan, who's busy with the shoot of his next film with Trivikram Srinivas lashed out at an unnamed comedian who was last seen in Nithiin's film 'A..Aa'. The actor also apparently went on to ask the comedian to stay within his limits, for reasons yet unknown.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X