Pawan Kalyan: సూపర్ హిట్ దర్శకుడితో పవన్ కల్యాణ్ మల్టీస్టారర్... మరో హీరో ఎవరంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సినిమాల షూటింగ్స్ తోనూ బిజి బిజిగా గడుపుతున్నారు. ఆయన ఇప్పటికే బ్రో సినిమాలో నటించగా.. ప్రస్తుతం ఓజీ, హరిహరవీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఆయన మరో సినిమాకు కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. అది కూడా మల్టీ స్టారర్ మూవీ. తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో పవన్ ఓ మల్టీ స్టారర్ మూవీ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం బయటకు వచ్చింది. అసలు ఆ డైరెక్టర్ ఎవరు.. హీరో ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటునే... సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక ఆయన ప్రస్తుతం సుజిత్ సింగ్ దర్శకత్వంలో ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ సినిమా ఎలక్షన్స్ తర్వాతే ఉంటుందని అంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా మల్టీ స్టారర్ మూవీ. ఇప్పటికే పవన్ కల్యాణ్ మల్టీ స్టారర్ మూవీస్ చేసిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ తో కలిసి గోపాలా గోపాలా సినిమా చేయగా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.

ఇక పవన్ కల్యాణ్ మల్టీ స్టారర్ మూవీస్ చేసేందుకు ముందుంటారన్న విషయం తెలిసిందే. కథ డిమాండ్ చేస్తే తాను స్టార్ హీరో అన్న ఫీలింగ్ లేకుండా పవన్ మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ముందుంటారు. ఇక ఇప్పుడు మరో సినిమా మల్టీ స్టారర్ చేయనున్నట్లు తెలుస్తోంది. తనకు సూపర్ హిట్ సినిమాను అందించిన తమిళ దర్శకుడితో సినిమా చేయనున్నట్లు సినీవర్గాల సమాచారం.
ఆయన ఎవరో కాదు.. పవన్ కెరియర్ లోనే సూపర్ హిట్టుగా నిలిచిన ఖుషి సినిమాకి దర్శకత్వం వహించిన ఎస్ జే సూర్య. ఆయనతో కలిసి మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ఖుషి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక వీరి కాంబోలో వచ్చిన మరో సినిమా కోమరం పులి. ఆ సినిమా పరాజయం చెందింది.

ఇక ఇప్పుడు వీరి కాంబోలో మల్టీ స్టారర్ మూవీ రాబోతుందట. ఎస్జే సూర్య తమిళంలో ఎందరో స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే అజిత్ కుమార్ తో మాత్రం సూర్య సినిమాలు చేయలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాను అజిత్‌తో సినిమా తీయాల్సి వస్తే... అజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలనుకుంటున్నట్లు ఇటీవల తెలిపారు. ఒకవేళ సూర్య మళ్లీ మెగాఫోన్ పట్టి అజిత్, పవన్ కాంబోలో మాసివ్ మల్టీస్టారర్ తెరకెక్కిస్తే రికార్డులు నెక్ట్స్ లెవల్లో ఉంటాయని ఫ్యాన్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











