Pawan Kalyan:లోకేష్ కనకరాజ్‌తో పవర్ స్టార్ సినిమా.. బాక్సాఫీస్ బద్దలే ?

పవర్ స్టార్ కల్యాణ్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలుండటంతో..ఆయన వీలైనన్ని సినిమాలు చేయాడానికి సిద్దం అయినట్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. సాహో దర్శకుడు సుజీత్‌తో ' #OG' మూవీలో నటిస్తుండగా...హరీష్ శంకర్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' మరియు క్రిష్‌తో 'హరి హర వీరమల్లు' సినిమాలు చేస్తున్నాడు.

దీంతో పాటు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న 'BRO' సినిమాలో కూడా పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. తాజాగా ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..

Power Star pawan kalyan movie with Lokesh Kanakaraj..?

90శాతం పూర్తి చేసుకున్న 'హరి హర వీరమల్లు': టాలెంటెడ్ దర్శకుడైనా క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు'అనే సినిమా చేస్తున్నారు. చారిత్రాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తైంది. గ్రాఫిక్స్ వర్క్‌తో పాటు..సినిమా క్లైమాక్స్ షూటింగ్ తీయాల్సి ఉంది. పవన్ వరుస పెట్టి సినిమాలు చేస్తూండటంతో 'హరి హర వీరమల్లు' ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.

Power Star pawan kalyan movie with Lokesh Kanakaraj..?

షేక్ చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ లుక్: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో నటిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బ్లాస్టర్ తరువాత.. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో..'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'తేరీ' సినిమాకు 'ఉస్తాద్ భగత్ సింగ్'రీమేక్. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన లభించింది.

Power Star pawan kalyan movie with Lokesh Kanakaraj..?

సాయిధరమ్ తేజ్‌తో 'Bro'..సుజీత్‌తో ' #OG': ఈ రెండు సినిమాలతో పాటు, తన మేనల్లుడైనా సాయిధరమ్ తేజ్‌‌తో కలిసి 'Bro' అనే సినిమాలో నటిస్తున్నారు. నటుడు, దర్శకుడు సముద్రఖని bro సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది.

30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు మాత్రమే పవన్ ఈ సినిమాలో కనిపిస్తారట. ఇక సాహో దర్శకుడు సుజీత్‌తో ' #OG' సినిమాకు కూడా గ్రీన్ సీగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. థమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Power Star pawan kalyan movie with Lokesh Kanakaraj..?

లోకేష్ కనకరాజ్‌ మరో కొత్త సినిమాకు గ్రీన్ సీగ్నల్..?: తాజాగా పవన్ కల్యాణ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తమిళంలో ఫుల్ ఫాంలో ఉన్న లోకేష్ కనకరాజ్‌‌తో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సన్ పిక్చర్స్‌కు పవన్ కల్యాణ్ ఓ సినిమా కమిట్మెంట్ ఇచ్చారు. ఆ సినిమాను లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో చేయాలని సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.

దీనిపై సన్ పిక్చర్స్ సంస్థ వైస్ చైర్మన్ ఇటీవలే పవన్ కళ్యాణ్‌తో కాసేపు చర్చలు కూడా జరిపారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమాలు పూర్తి అయిన వెంటనే ..లోకేష్ కనకరాజ్‌‌- పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయడానికి సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.

Power Star pawan kalyan movie with Lokesh Kanakaraj..?

కాంబినేషన్‌ సెట్ అయితే బాక్సాఫీస్ బద్దలే: 'మాస్టర్', 'ఖైదీ' , 'విక్రమ్' వంటి బ్లాక్ బాస్టర్ల తరువాత లోకేష్ కనకరాజ్‌ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన హీరో విజయ్‌తో 'లియో' అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అవ్వగానే రజినీకాంత్‌తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తరువాతే పవన్ కళ్యాణ్ - లోకేష్ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. లోకేష్ కనకరాజ్‌‌- పవన్ కల్యాణ్ కాంబినేషన్‌ సినిమా సెట్ అయితే.. బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం అని పవర్ స్టార్ ఫాన్స్ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X