మేనల్లుడితో పవన్ కళ్యాణ్ మాస్ మల్టీస్టారర్.. డైరెక్టర్ గా స్టార్ విలన్.. ఇది అరాచకమే?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు కేవలం పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మెగా హీరోలు కూడా కలిసి నటించడం మొదలు పెడితే ఒక సారి భారీ స్థాయిలో రికార్డులను క్రియేట్ అవుతాయి అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆచార్య సినిమా పవర్ఫుల్ గా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ వైరల్ గా మారింది. ఇక ఆ సినిమాను ఒక స్టార్ విలన్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఇప్పటికే మెగా మూవీపై భారీ అంచనాలు
మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. మెగా అభిమానులకు ఈ సినిమా కూడా ఒక ఫెస్టివల్ అని కూడా చెప్పవచ్చు.

మేనల్లుడితో పవన్ కళ్యాణ్
ఇక మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ మల్టీస్టారర్ సినిమాలు రావడానికి చాలా సమయం పడుతుంది. అంచనాల స్థాయి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరైన కథ సెట్ అయితే గాని అలాంటి ప్రాజెక్టులో సెట్స్ పైకి రావని చెప్పవచ్చు. ఇక త్వరలోనే మరో మెగా మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మెగా మేనల్లుడి తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వైరల్ గా మారింది.

మరో హీరోగా సాయి
ఇక ఆ మెగా హీరో మరెవరో కాదు సాయి ధరంతేజ్ అని తెలుస్తోంది. సాయి ధరంతేజ్ అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నప్పటి నుంచీ కూడా సాయి ధరమ్ తేజ్ తన చిన్న మామ తోనే ఎక్కువగా కలిసి ఉన్నాడు. అలాగే అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన చాలా పర్సనల్ విషయాలను కూడా దగ్గరుండి చూసుకునే వారు.

త్రివిక్రమ్ ఆధ్వర్యంలో..
ఇక మొదటి సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ ఇద్దరు కూడా తెరపై కనిపించే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియాలో కూడా టాక్ వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్టును త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుండి నడిపించే ఉన్నట్లు సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ సొంత ప్రొడక్షన్ పీకే క్రియేటివ్ వర్క్స్ ఆ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.

దర్శకుడు ఎవరంటే..
ఇక మెగా మల్టీస్టారర్ ను డైరెక్ట్ చేయబోయేది మరెవరో కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో విలన్ గా క్రేజ్ అందుకుంటున్న సముద్రఖని అని తెలుస్తోంది. విలన్ గా కంటే ముందు ఈ నటుడు మంచి దర్శకుడు అని అందరికీ తెలిసిన విషయమే. గతంలో శంభో శివ శంభో అనే సినిమాతో తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా సముద్రఖని మంచి సక్సెస్ అందుకోలేదు. ఇక అల వైకుంఠపురములో విలన్ గా కనిపించి మంచి క్రేజ్ ను అందుకున్నాడు.

మంచి సందేశంతో పాటు..
ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేసేందుకు సముద్రఖని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక సినిమాలో మరొక ముఖ్యమైన పాత్రలో సాయి ధరంతేజ్ కనిపిస్తాడట. సినిమాలో మంచి సందేశంతో పాటు మాస్ ఎలివేషన్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్టు కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











