పవర్ స్టార్ పవర్ లెస్ మూవీస్ తో ఇమేజ్ కోల్పోతాడా.!?
ఒక దాని తర్వాత ఒకటిగా తెగ సినిమాలు చేస్తున్నాడు కానీ పవన్ కళ్యాన్ కనీసం వాటిలో ఒక్కదాంతో అయినా ఆసక్తి రేకెత్తంచలేకపోతున్నాడు. వేగంగా సినిమాలు చేస్తున్నాడనే ఆనందమే తప్ప రాబోయే పవన్ చిత్రాల్లో దేనిపైన అభిమానులకి కూడా అంచనాలు లేవు..తమిళ దర్శకుడు విష్ణువర్థన్ మంచి దర్శకుడే అయినా అతనికి తెలుగు వారి టేస్ట్ ఏమాత్రం తెలిసి ఉంటుందో అనేది ఓ అనుమానమైతే, పవన్ ఇమేజ్ ని ఎస్టిమేట్ చేయలేడనేది మరో వేలీడ్ డౌట్.
ఇక దబాంగ్ లాంటి చవకబారు కథాంశంతో రూపొందే గబ్బర్ సింగ్ కి మన ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనుకోవడం అవివేకం. అలాంటి సినిమాలు వందలాది మంది చూసి వున్న మన ప్రేక్షకులని అందులో రవ్వంత కొత్తదనం కనిపించే ఆస్కారం లేదు..ఇక జీసస్ క్రైస్ట్ సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ కూడా వేస్ట్ ఎటెంప్ట్ అనే అనుకోవాలి. రాజు సుందరం దర్శక్వంలో పవన్ నటిస్తున్నాడంటే లారెన్స్ కూడా ఆశ్చర్యపోతాడని చెప్పాటి. పవర్ లేని సినిమాలు ఇన్ని చేస్తున్నా పవన్ వీటి బదులుగా పవర్ ఫుల్ సినిమా ఒక్కటి చేసి భారీ హిట్టు కొట్టి రిటైరైపోతే చాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











