Mahesh Babu గుంటూరు కారం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.... ఎందుకో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటడ్ ఫిల్మ్ ఏదైనా ఉందంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం. ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో గురూజీ మొదట టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారట. అయితే ఆ హీరో మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇంత మంచి మూవీని ఆ స్టార్ హీరో ఎందుకు రిజెక్ట్ చేశారు.. ఇంతకీ ఆయన ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. మరి ఆయన నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. ఇక ఈ సినిమా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Power Star Pawan Kalyan Rejected Mahesh Trivikram Guntur Karam Movie Do you Know Why?

గుంటూరు కారం సినిమాలో మహేశ్ బాబు సరసన మొదట పూజా హెగ్డే అనుకున్నారు మేకర్స్. అయితే ఆమె తప్పుకోవడం.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, పాట ఆకట్టుకుంటుంది. మహేశ్ బాబును చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను మొదట ఓ టాలీవుడ్ స్టార్ హీరో చేయాల్సి ఉండేనట. అయితే ఆయన రిజెక్ట్ చేయడం వల్లే ఈ సినిమా మహేశ్ బాబు చేతుల్లోకి వెళ్లిందని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

Power Star Pawan Kalyan Rejected Mahesh Trivikram Guntur Karam Movie Do you Know Why?

గుంటూరు కారం సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలి అనుకున్నారట. ఆయనకు కథ కూడా చెప్పారని తెలుస్తోంది. అయితే ఆయన రిజెక్ట్ చేయండ వల్లే మహేశ్ బాబు చేతుల్లోకి వెళ్లిందట. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే మొదట పవన్ కు ఈ కథను వినిపించారట. కథ కూడా నచ్చిందట. కానీ ఆయన పొలిటికల్ బిజీ షెడ్యూల్.. చేతిలో ఉన్న సినిమాల కారణంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశారట.

అందువల్లే అయిష్టంగానే పవన్ కల్యాణ్ గుంటూరు కారం సినిమాను వదులుకున్నారని తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... ఈ సినిమా పవన్ చేసి ఉంటే.. మరో లెవెల్ లో ఉండేదని.. పవన్ ఫ్యాస్ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X