దిల్ రాజుకి నో చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...?
వెంకటేష్, పవన్ కళ్యాణ్ లు కలిసి త్వరలో ఓ మల్టిస్టారర్ చిత్రం చేస్తున్నారనే సంగతి తెలిసిందే. గత కొంత కలం నుంచి మంచి స్నేహితులుగా వున్నా వెంకీ, పవన్ లు ఎప్పట్నుంచో కలిసి నటించాలనుకుంటున్నారు. ఇన్నాలకు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దల్చబోతుందనీ, అదీ ఇద్దరు స్టార్లు కలిసి సినిమా తీయబోతున్నారని తెలుసుకొన్న అభిమానులకు అవదులు లేకుండా పోయాయి.
కాగా మంచి కథ..కథనాలు ఉన్న చిత్రాలను నిర్మిస్తూ, ఉత్తమాభిరుచి గల నిర్మాతగా దిల్ రాజు పేరు తెచ్చుకున్నాడు. అటువంటి నిర్మాత ఓ సినిమా ఆఫర్ చేస్తే 'నో' చెప్పే హీరో ఉంటాడా? వుండరు కదా... కానీ ఇప్పుడు ఓ హీరో అలా 'నో' చెప్పాడు. ఇంతకీ, అసలు విషయం ఏమిటంటే.. 'కొత్త బంగారు లోకం' చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు.
ఈ చిత్రంలో వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తారనే ప్రచారం బాగా జరిగింది. వెంకటేష్ ఓకే చెప్పాడట కూడా. అయితే, తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మాత్రం ఈ చిత్రంలో నటించడానికి దిల్ రాజుకి 'నో' చెప్పాడని టాలీవుడ్ సమాచారం. దీంతో ఇప్పుడీ పాత్రను ఎవరితో చేయిస్తే బాగుంటుందా అని దిల్ రాజు ఆలోచనలో పడ్డాడట.


Click it and Unblock the Notifications











