‘జబర్దస్త్’ వేణుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా?
హైదరాబాద్: ఇటీవల దాడిగి గురైన ‘జబర్దస్త్' వేణుకు సినీ, టీవీ వర్గాల నుండి మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. మెగాబ్రదర్ నాగబాబు ఇప్పటికే వేణుపై దాడిని తీవ్రంగా ఖండించారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వేణుకు మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. వేణును కలిసి తన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవల ప్రసారమైన జబర్దస్త్ షోలో తమ మనోభావాలు దెబ్బతీసేలా స్కిట్ చేసారంటూ గౌడ సంఘాల నేతలు వేణుపై దాడి చేసారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని గౌడ సంఘాల నేతలు ఆరోపించాస్తున్నారు.

దాడి ఘటనపై మంచు మనోజ్ స్పందిస్తూ...దాడి ఘటనను చౌకబారు చర్యగా, అమానవీయ చర్యగా పేర్కొన్నారు. కులం, మతం కంటే ముందు....మనం మనుషులమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. "మనోభావాలు దెబ్బతిన్నందుకు ఇచ్చిన రియాక్షన్ ...మర్డర్లు,మానభంగాలు చేసినవాళ్లకు ఇస్తే చాలా త్వరగా డవలప్ అవుతాం..." అంటూ రామ్ తీవ్రంగా స్పందించారు
అయితే ఏ కులాన్ని కించపరిచే ఉద్దేశం తమకు లేదని.. కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడానికే స్కీట్ చేశామని వేణు మీడియాకి తెలిపారు. ఆ ప్రొగ్రాంలో కులం పేరు ప్రస్తావించలేదని వారన్నారు. తమ ప్రొగ్రాం వల్ల గౌడ కులస్తులు హర్ట్ అయితే క్షమాపణలు అని వేణు తెలిపారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











