పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ లు కలిసిపోయారు...!
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మధ్య తలెత్తిన అభిప్రాయబేధాలు వారు విడిపోవడానికి కారణమయ్యాయని, చాలా కాలంగా రేణు దేశాయ్ పూణెలో తన పుట్టింట్లోనే ఉంటోందని, అప్పుడప్పుడు తనయుడు అఖీరానందన్ ఇక్కడికి రావడం తప్ప పవన్ తన భార్యని కలుసుకోలేదని పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ఇప్పుడు వారిద్దరి మధ్య వచ్చిన సమస్యలకి పరిష్కారం దక్కింది. పవన్ దగ్గరకి రేణు తిరిగి వచ్చేసింది.
తానూ పవన్ కళ్యాణ్ వైవాహిక బంధం నుంచి విడిపోలేదని నటి ,డిజైనేర్ రేణు దేశాయ్ పేర్కొన్నారు .తామిద్దరం విడిపోయినట్టు వస్తోన్న వార్తలన్నీ కేవలం పుకార్లే అని ఒక ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు స్పష్టం చేసారు. తమ కుటుంబాన్ని పూణే కి మార్చినప్పటినుంచి ఈ విధమైన పుకార్లు వ్యాపించాయని ఆమె చెప్పారు.ఈ అర్ధం లేని పుకార్లు తనను ,పవన్ ను ఎంతగానో బాధ పెట్టాయని ఆవేదన వ్యక్తం చేసారు .ఈ పుకార్ల ప్రభావం తమ పిల్లల పై పడుతుందేమో అని భయం గా వుందని చెప్పారు.తాము 11 ఏళ్ళనుంచి పరస్పరం ప్రేమించు కుంటున్నామని భవిష్యత్ లోను అలాగే ఉంటామని రేణు అన్నారు . పవన్ రేణు తొలుత బద్రి చిత్రం లో కలసి నటించారు.
ఇటీవల షూటింగ్ లో పవన్ కి తీవ్రమైన బ్యాక్ పెయిన్ రావడంతో అతని హాస్పిటల్ లో జాయిన్ చేయగా, ఈ సంగతి తెలిసిన రేణు హుటాహుటిన పిల్లలతో సహా తిరిగి వచ్చేసిందట. ఇక ఈ జంట మధ్య వచ్చిన ఇబ్బందులు తొలగిపోయినట్టేనని, తమ మధ్య వచ్చిన సమస్యలని వారు పరిష్కరించుకున్నారని ఆ కథనం సారాంశం.
అయితే అసలు తాము విడిపోయామన్నదే అబద్దమని, తాను కేవలం తల్లిదండ్రులతో సమయం గడపడానికి మాత్రమే వెళ్లానని రేణు చెప్తోందని కూడా అంటున్నారు.
హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో ఉన్న పవన్ ఇల్లు పునర్ నిర్మాణం లో వుండటం తో పవన్ తన మకాం పూణే కి మార్చారు .కేవలం షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చే వారు .ఎపుడైతే ఇద్దరు మకాం మార్చారో అప్పటి నుంచి వారు విడి పోయారని పుకార్లు వ్యాపించాయి.ఈ పుకార్లు దాదాపు ఏడెనిమిది నెలలనుంచి వున్నాయి మరి వీటిని ఖండించడానికి రేణు ఇంత ఆలస్యం ఎందుకు చేసారో ??ఇప్పటికైనా నిజాలు చెప్పి మంచి పని చేసారు. ఏదైతేనేం ఇద్దరి మధ్య విబేధాలు తొలగిపోవడం పవన్ అభిమానులకి ఆనందం కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications











