ఎన్టీఆర్ కొత్త చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్: ఈ రెండింటినీ రిజిస్టర్ చేయించిన యూనిట్
పేరులోనే కాదు... రూపం... టాలెంట్‌లో తాత నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. 'నిన్ను చూడాలని' అనే సినిమాతో హీరోగా పరిచయమైన అతడు.. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా చిన్న వయసులోనే స్టార్‌డమ్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక, కొన్నేళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు.. క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఆ సినిమాకు పెట్టబోయే టైటిల్ లీకైంది. ఆ సంగతులేంటో మీరూ చూడండి.!

డబుల్ హ్యాట్రిక్‌కు చేరువ.. ఏకైక హీరోగా రికార్డ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఢీలా పడిన అతడు.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక, అక్కడి నుంచి వెనుదిరిగి చూడని తారక్.. వరుసగా ఐదు విజయాలను అందుకున్నాడు. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి హీరోగా రికార్డులకు ఎక్కాడు.

భారీ మల్టీస్టారర్‌లో తారక్.. రియల్ హీరో రోల్
వరుస విజయాలతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్... ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రాబోతున్న ఈ భారీ చిత్రంలో అతడు కొమరం భీంగా కనిపించనున్నాడు. అలాగే, చరణ్.. అల్లూరి పాత్రను పోషిస్తున్నాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయిపోతున్న ఎన్టీఆర్
RRR షూటింగ్ జరుగుతుండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇందులో భాగంగానే తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. రాధాకృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇది పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందనుందని ప్రచారం జరుగుతోంది.

ఇంకోటి కూడా ఫిక్స్.. క్రేజీ డైరెక్టర్‌తో సినిమా
RRRతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్న తారక్... మరో దర్శకుడితో సినిమా చేయడానికి సంతకం చేసేశాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అతడే.. KGFతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ అని అంటున్నారు. పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందే ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కబోతుంది.

ఆ రెండు ట్వీట్లతో క్లారిటీ ఇచ్చేసిన యూనిట్
ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు జరిగింది. ఆ సందర్భంగా ప్రశాంత్ నీల్.. ‘పవర్ హౌస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. త్వరలోనే రేడియేషన్ సూట్‌తో మీ దగ్గరకు రాబోతున్నా' అని ట్వీట్ చేశాడు. ఇక, రెండు రోజుల క్రితం ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా మైత్రీ సంస్థ ‘మిమ్మల్ని రేడియేషన్ సూట్‌తో కలవబోతున్నాం' అని ట్వీట్ చేసింది. దీంతో సినిమా కన్ఫార్మ్ అని తేలిపోయింది.
Recommended Video

జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్
ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని కన్ఫార్మ్ అయిపోయిన నేపథ్యంలోనే... దీనికి పవర్‌ఫుల్ టైటిల్ పెట్టబోతున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. తారక్ నటించబోయే సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఫిలిం చాంబర్‌లో ‘మిస్సైల్', ‘న్యూక్లియర్' అనే టైటిల్స్ రిజిస్టర్ చేయించిందట. ఈ రెండింటిలో ఒకటి ఫైనల్ అవుతుందని టాక్.


Click it and Unblock the Notifications











