పవన్ ఫ్యాన్స్ ని కంగారుపెడుతున్న రూమర్
ముఖ్యంగా రీసెంట్ గా మెహర్ రమేష్ డైరక్ట్ చేసిన షాడో చూసిన వాళ్లు అయితే షాక్ అవుతున్నారు. కంత్రి,భిళ్లా,శక్తి, షాడో అంటూ వరసగా చిత్రాలు వదులుతున్న మెహర్ రమేష్ దృష్టి మొదటినుంచీ పెద్ద హీరోల మీదే ఉంది. ఎన్ని ప్లాప్స్ వచ్చినా వారి డేట్స్ పడుతూనే ఉన్నాడు. కాబట్టి ఏమో పవన్ ని ఒప్పించి ఉంటాడనే సందేహాలు కూడా వస్తున్నాయి. దానికి తోడు పవన్ మొదటి నుంచి భాక్సాఫీస్ ని పట్టించుకోకుండా ఫెయిల్యూర్ దర్శకులుకు ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు.
మరో ప్రక్క పవన్ కి, మెహర్ రమేష్ కు ఎప్పటినుంచో అంటే మెహర్ రమేష్ దర్శకుడు కాకముందు నుంచి పరిచయం ఉంది. అంతేకాక మెహర్ రమేష్ ..మెగా క్యాప్ కు చుట్టం అని కూడా అంటారు. ఈ నేఫద్యంలో పవన్ తో చర్చలు జరిగాయనే ఈ రూమర్ కి బలం చేకూరినట్లైంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్...త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం అనంతరం గబ్బర్ సింగ్ 2 చేస్తాడని చెప్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది.


Click it and Unblock the Notifications












