ప్ర‌భాస్ క్రేజీ అప్‌డేట్: సింగిల్ టేక్‌లో రెబల్ స్టార్.. ఆ ఒక్క సీన్ కోసమే అంతనా!

ఇటీవలే 'సాహో' డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తాజా సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నింపుతోంది.

పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్ర‌స్తుతం చిత్ర షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ సినిమాపై అటు ప్రభాస్, ఇటు రాధాకృష్ణ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా రావాలని సినిమా షూటింగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

Prabhas 20: Crazy Update for RebelStar Fans

అయితే తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ఓ యాక్ష‌న్ సీన్ కోసం 2 కోట్ల‌ రూపాయలతో భారీగా మార్కెట్ సెట్‌ వేశార‌ని తెలిసింది. ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ త‌న 150 మంది అసిస్టెంట్స్‌తో ప‌దిరోజుల పాటు క‌ష్ట‌ప‌డి మార్కెట్ సెట్‌ను వేశార‌ని సమాచారం. ఈ సెట్‌లో ఓ ఛేజింగ్‌ సీన్ షూట్ చేశారట. అందులో ప్రభాస్ ఓ కిలోమీట‌ర్ పాటు ప‌రిగెత్తి సింగిల్ టేక్‌లో ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారట.

ఈ సినిమాకు మొదట 'జాను' అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత.. 'ఓ డియర్' అనే టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను ద‌స‌రా కానుకగా విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X