ప్రభాస్ 20: అదీ ఇదీ అన్నారు.. చివరకు ఇలా ఫిక్సయ్యారా?
'బాహుబలి' లాంటి భారీ హిట్ తర్వాత 'సాహో' రూపంలో నిరాశపర్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ లో 20వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసి జార్జియా వెళ్లారు యూనిట్ సభ్యులు. అక్కడి అందమైన లొకేషన్స్‌లో చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా టైటిల్ విషయమై తాజాగా ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఇప్పటికే ఈ మూవీ జాన్, ఓ డియర్ అనే పేర్లను పరిశీలనలో ఉంచారని విన్నాం. కానీ తాజా సమాచారం మేరకు అవేవీ కాదని కొత్తగా "రాధేశ్యామ్" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా యూనిట్ నుంచి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని ఫిలింనగర్ టాక్.
ఉగాది కానుకగా మార్చి 25న ఈ సినిమా టైటిల్ కన్ఫామ్ చేస్తూ ఫస్ట్‌లుక్ విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారట. సో.. ఆ రోజే చూడాలి మరి ఈ మూడింటిలో ఏది అనౌన్స్ చేస్తారనేది.


Click it and Unblock the Notifications











