2020ని పక్కా ప్లాన్ తో వాడుకున్న ప్రభాస్.. అందుకే వచ్చే ఏడాది డబుక్ ధమాకా
రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా భవిష్యత్తులో బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ఇక హీరోతో వర్క్ చేయాలని అనుకునే దర్శకులు కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ లతోనే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రబాస్ లైనప్ కెరీర్ కు మరో మేజర్ ప్లస్ పాయింట్ లా మరనుందని చెప్పవచ్చు. ఇక ఈ ఏడాది సినిమా షూటింగ్స్ లేక కొందరు ఇబ్బంది పడ్డప్పటికి ప్రభాస్ మాత్రం చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాడు.

వచ్చే ఏడాది రెండు సినిమాలతో
2020 కరోనా ధాటికి చాలా మంది జీవితాలలో పెను మార్పులను తెచ్చిందనే చెప్పాలి. టాలీవుడ్ హీరోలతే చాలా వరకు భవిష్యత్తు ప్రాజెక్టులను చాలా బలంగా సిద్ధం చేసుకుంటున్నట్లు అర్ధమయ్యింది. ఇక ప్రభాస్ అంచనాలకు మించిన పాన్ ఇండియా కథలను రెడీ చేసుకున్నాడు. ఇక వచ్చే ఏడాది రెండు సినిమాలతో సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సమ్మర్ లోనే రాధేశ్యామ్
ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ అయిపోగానే వెంటనే మరో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. లాక్ డౌన్ లోనే షూటింగ్స్ విషయాల్లో ప్రభాస్ పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడట. ఇక ముందుగా రాధేశ్యామ్ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.

2021లో మరో సినిమా
రాధేశ్యామ్ అనంతరం ప్రభాస్ బాలీవుడ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ తో బిజీ కానున్నాడు. వచ్చే ఏడాది జనవరి నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేసి 2021 దసరా సమయంలో సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని స్కెచ్ వేసినట్లు టాక్. ఓం రావత్ డైరెక్ట్ చేయనున్న ఆ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Recommended Video

ఆ తరువాత మరో రెండు సినిమాలు
2021లో ఎలాగైనా రెండు సినిమాలను విడుదల చేయాలని పక్కా ప్లాన్ తో సిద్దమైన ప్రభాస్ 2022లో నాగ్ అశ్విన్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సాలర్ సినిమాలను సెట్స్ పైకి తెస్తాడట. ఆ రేండు సినిమాలు కూడా ఏడాది గ్యాప్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నాలుగు సినిమాల గనక హిట్టయితే ప్రభాస్ రేంజ్ మాత్రం మరో లెవెల్ కు వెళుతుందని చెప్పవచ్చు. మరి ప్రభాస్ ఎలాంటి హిట్స్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











