ప్రభాస్ 20వ చిత్రం.. 10 కేజీలు తగ్గిపోతాడట!
Recommended Video

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. 2019 లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో, భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాహో తరువాత ప్రభాస్ 20వ చిత్రానికి కూడా సన్నాహకాలు మొదలైపోయినట్లు తెలుస్తోంది. తాజగా ఈ చిత్రం గురించి వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి.

10 కేజీలు
బాహుబలి చిత్రంలో రాజుల కాలం నటి వేషధారణకు అనుగుణంగా ప్రభాస్ బలిష్టంగా కనిపించాడు. సాహో చిత్రంలో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కానీ ప్రభాస్ 20వ చిత్రం ఎమోషల్ ప్రేమ కథగా, పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుందట. కథకు అనుగుణంగా ప్రభాస్ ఈ చిత్రం కోసం 10 కేజీల బరువు తగ్గనున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 6
ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. సెప్టెంబర్ 6 న ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. జిల్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం నచ్చడంతో రాధాకృష్ణకు ప్రభాస్ ఒకే చెప్పాడు.

ప్రేమ కథలు
ప్రభాస్ కు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కానీ ప్రేమ కథా చిత్రాలతో కూడా గతంలో ప్రభాస్ హిట్స్ అందుకున్నాడు. వర్షం, డార్లింగ్ వంటి చిత్రాలు ప్రేమకథలే.

పూజ హెగ్డే
ఈ చిత్రంలా ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీజే తరువాత టాలీవుడ్ లో పూజ హెగ్డే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం పూజ హెగ్డే మహేష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











