ప్రభాస్ 21 క్రేజీ అప్‌డేట్: హీరోయిన్ ఫిక్స్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ 21వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఇటీవలే అఫీషియల్ గా ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబందించిన క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. వివరాల్లోకి పోతే..

ప్రభాస్ 21.. ప్లాన్ ఇదే

ప్రభాస్ 21.. ప్లాన్ ఇదే

వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందనున్న ప్రభాస్ 21వ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు రానుంది. అశ్వినిదత్‌ ఈ సినిమాకు వ్యవహరించబోతున్నారు. భారీ హంగులతో నిర్మించి చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది చిత్రయూనిట్ ప్లాన్.

ప్రభాస్ అభిమానులు ఖుషీ అయ్యే అప్‌డేట్

ప్రభాస్ అభిమానులు ఖుషీ అయ్యే అప్‌డేట్

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు నాగ్ అశ్విన్ తెలిపాడు. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్ విషయమై తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ అప్‌డేట్ చూసి ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

బాలీవుడ్ భామ.. అదే జరిగితే

బాలీవుడ్ భామ.. అదే జరిగితే

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఈ మేరకు దీపికకు కథ కూడా నేరేట్ చేశారని, ఆమె ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే దీపికకు ఇదే తొలి తెలుగు సినిమా అవుతుంది.

Recommended Video

Prabhas 21 : Nag Ashwin To Direct Prabhas | Vyjayanthi Movies || Filmibeat Telugu
ప్రభాస్ స్పీడ్.. పూజాతో రొమాన్స్

ప్రభాస్ స్పీడ్.. పూజాతో రొమాన్స్

మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సాహో డిసాస్టర్ మరిపించేలా ఈ సినిమాను అన్ని హంగులు జోడించి నిర్మిస్తున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X