ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: ప్రభాస్- నాగ్ అశ్విన్ మూవీ కాన్సెప్ట్ ఇదే..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమాను 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాను ఇటీవలే అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కథాంశానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Recommended Video


ప్రభాస్ 21.. కథ ఇదే..
సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ మేరకు ప్రభాస్ కెరీర్‌లో 21వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ ఫ్యూచరిస్టిక్ జోనర్‌లో ఉండనుందని తెలుస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏంటనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా కథను రెడీ చేశారని, దానికి మరిన్ని మెరుగులు దిద్ది తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ న్యూస్ బయటకు తెలియడంతో ప్రేక్షకుల్లో ఆతృత మరింత పెరిగింది.

నాగ్ అశ్విన్ కథ.. ప్రభాస్ రేంజ్
ఇకపోతే ‘మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ అశ్విన్ కథతో ప్రభాస్ రేంజ్ తోడైతే మరిన్ని సంచలనాలు ఖాయం అని, యంగ్ రెబల్ స్టార్ రేంజ్ ఇంకా పెరిగిపోవడం ఖాయం అని చెప్పుకుంటున్నారు జనం.

ప్రభాస్ తప్ప ఇంకెవరికీ సూట్ కాదు
ఇప్పటికే ఈ సినిమా గురించి స్పందించిన నాగ్ అశ్విన్.. తను రాసుకున్న కథలో హీరో పాత్ర పోషించే సత్తా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌కు తప్ప వేరెవరికీ లేదని చెప్పాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు నాగ్ అశ్విన్ తెలిపాడు.

భారీ హైప్.. ప్రభాస్ ఫ్యాన్స్
తన కథ విని ప్రభాస్ షాకయ్యాడని, ఇది పూర్తి కమర్షియల్ సినిమా అని అన్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి చాలా సమయం పడుతుందని, స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతామని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ గురించి ఊహల్లో తేలుతూ భారీగా అంచనా వేస్తున్నారు.

ప్రభాస్‌తో పూజా రొమాన్స్
మరోవైపు ప్రస్తుతం ప్రభాస్ తన 20 వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఓ డియర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











